Aadhi Pinisetty : ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి వేడుకలు షురూ.. హల్దీ ఫంక్షన్‌లో డ్యాన్సులు

Aadhi Pinisetty : గత రెండేళ్లుగా సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు.కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.
హల్దీ ఫంక్షన్‌తో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోలు హల్దీ వేడుకకు హాజరయ్యారు. నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ హల్దీ ఫంక్షన్‌కు హాజరైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా డ్యాన్సులతో హోరెత్తించారు.
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ మలుపు, యాగవరాయినుం నా కాక్క, మరగధ నానయం వంటి కొన్ని సినిమాల్లో కలిసి పనిచేశారు. మే 18న చెన్నైలో వీరి వివాహం జరగనుంది.
నిక్కీ గల్రానీ, ఆది గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు.. కానీ ఆ విషయం ఎప్పుడూ బయటపెట్టలేదు. ఆది తండ్రి మరియు చిత్రనిర్మాత రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుకలో ఆది కుటుంబంతో కలిసి నిక్కి కనిపించింది. అయినప్పటికీ, వారు తమ సంబంధం గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. తమ మధ్య రిలేషన్ ని గోప్యంగా ఉంచారు. ఇప్పుడు పెళ్లితో వాళ్లిద్దరూ ఒక్కటికానున్నారు.
కాగా, రామ్ పోతినేని ప్రధాన పాత్రలో వస్తున్న యాక్షన్ డ్రామా 'ది వారియర్'లో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com