Aadhi Nikki: ఆది, నిక్కీల పెళ్లికి డేట్ ఫిక్స్.. అక్కడే గ్రాండ్‌గా..

Aadhi Nikki: ఈమధ్యకాలంలో సినీ పరిశ్రమకు చెందిన నటీనటులలో ప్రేమించి పెళ్లి చేసుకునేవారి సంఖ్య ఎక్కువయ్యింది. తాజాగా ఆ లిస్ట్‌లోకి యాడ్ అయ్యారు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ. హఠాత్తుగా ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఈ జంట అందరికీ షాక్ ఇచ్చింది. ఇక వీరి పెళ్లి డేట్ గురించి కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది.
మార్చి 24న ఆది, నిక్కీ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని కొన్ని రోజుల తర్వాత వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవరకు ప్రేక్షకులకు తెలియదు. 'మలుపు' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఆది, నిక్కీ.. కొన్నాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'మరగదమణి' సినిమా సమయానికి వీరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టు టాక్.
అయితే వీరి ఎంగేజ్‌మెంట్ చెన్నైలోని ఓ హోటల్‌లో ఏ హంగు ఆర్భాటం లేకుండా జరిగిపోయింది. కానీ పెళ్లి మాత్రం గ్రాండ్‌గానే చేసుకునే ఆలోచనలో ఉందట ఈ జంట. పెళ్లికి మే 18న ముహూర్తం కూడా ఖరారు అయినట్టు టాక్. మరి ఆది, నిక్కీ ఎంగేజ్‌మెంట్ తరహాలోనే పెళ్లి కూడా సైలెంట్‌గా చేసుకుంటారో.. లేదా సెన్సేషన్ చేస్తారో చూడాలి మరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com