Aadhi Pinisetty : నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి పెళ్లి..!

Aadhi Pinisetty : టాలీవుడ్‌లో మరో జంట పెళ్లి పీటలేక్కనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. 'బుజ్జిగాడు' ఫేమ్ సంజన గల్రానీ చెల్లెలు నిక్కీ గల్రానీతో హీరో ఆది పినిశెట్టి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. నిక్కీ గల్రానీతో కలిసి ఆది పినిశెట్టి రెండు సినిమాల్లో కలిసి నటించాడు.
'మలుపు' సినిమా నుంచే వీళ్ళీద్దరూ ప్రేమలో ఉన్నారని, గత కొన్నేళ్ళుగా డేటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. వీరి ప్రేమకి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ జంట ఒకటి కానుందట.. ప్రస్తుతం వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, త్వరలోనే పెళ్ళి కూడా ఫిక్స్ కానుందని తెలుస్తోంది.
అయితే ఈ విషయం పైన నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి స్పందించాల్సి ఉంది. ఆది పినిశెట్టి 2006లో తేజ దర్శకత్వం వహించిన ఒక వి చిత్రమ్‌తో నటుడిగా అరంగేట్రం చేసి విభన్నమైన చిత్రాలతో కెరీర్‌లో దూసుకుపోతున్నాడు.
అటు 1983 అనే మళయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయింది నిక్కీ గల్రానీ.. తెలుగులో సునీల్‌తో కృష్ణాష్టమి సినిమా చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com