Aadhi Pinisetty : ఆది పినిశెట్టి ఈ సారైనా శబ్ధం చేస్తాడా

సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది పినిశెట్టి. కెరీర్ ఆరంభంలోనే టాలెంటెడ్ అనిపించుకున్నాడు. కానీ అందుకు తగ్గ విజయాలు దక్కలేదు. దీంతో తమిళ్ లోనూ ప్రయత్నాలు చేసినా ఫలితాలు పెద్దగా రాలేదు. తెలుగులో సరైనోడు, అజ్ఞాతవాసి చిత్రాల్లో విలన్ గా అదరగొట్టాడు. రంగస్థలంలో కుమార్ బాబుగా మర్చిపోలేని నటనతో మెప్పించాడు. కానీ అతను అటు విలన్ గానూ, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఆగిపోలేదు. బ్రేక్ వచ్చినా.. ఆ పాత్రల్లో కంటిన్యూ కావాలనుకోలేదేమో.. మరోసారి హీరోగా ‘శబ్ధం’ అనే చిత్రంతో రాబోతన్నాడు.
2009లో ఆది హీరోగా నటించిన ఈరమ్ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రాన్ని 2011లో తెలుగులో వైశాలి పేరుతో డబ్ చేశారు. హీరో.. తను ప్రేమించిన అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఇతను కొన్నాళ్లు బాధపడి తర్వాత పోలీస్ అవుతాడు. ఆపై తను ప్రేమించిన అమ్మాయి అనుమానాస్పద రీతిలో మరణిస్తుంది. అందరూ ప్రమాదం అనుకుంటే అతను మాత్రం దాన్ని హత్య అని నమ్మి నిరూపిస్తాడు. పారానార్మల్ అండ్ సైకలాజిక్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని అరివళగన్ వెంకటాచలమ్ డైరెక్ట్ చేశాడు. ఈచిత్రంలో విశేషం ఏంటంటే.. ప్రతి ఫ్రేమ్ లోనూ వాటర్ కనిపిస్తుంది.
ఇన్నేళ్ల తర్వాత ఆ వైశాలి చిత్ర దర్శకుడు అరివళగన్ డైరెక్ట్ చేసిన మూవీనే ఈ శబ్ధం. అప్పుడు వాటర్ థీమ్ తో వచ్చారు. ఇప్పుడు సౌండ్ థీమ్ తో రాబోతున్నారు అనేలానే పోస్టర్స్ కనిపించాయి. ఆది పినిశెట్టి సరసన లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటించింది. సిమ్రన్, లైలా, రెడిన్ కింగ్ స్లే ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 28న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సారి కూడా సేమ్ కంటెంట్ కానీ.. సౌండ్ థీమ్ అనిపించేలా ఉన్న ఈ మూవీతో అయినా ఆది హీరోగా గట్టి శబ్ధం చేస్తాడేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com