Aadi Saikumar : ఆది సాయికుమార్.. ఎన్నాళ్లకు

ఆది సాయికుమార్.. సాయికుమార్ తనయుడుగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా మొదలుపెట్టినప్పుడు బానే ఆకట్టుకున్నాడు. ఓ రకంగా హ్యాట్రిక్ మూవీస్ కూడా పడ్డాయి. కానీ తర్వాతే అంతా మారిపోయింది. వరుసగా ఫ్లాప్స్ పడుతున్నాయి. ఈ దశలో ఆదిని జనం మర్చిపోయినట్టే అనేంతగా భావించారు ఆడియన్స్. ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీలో కూడా లైట్ తీసుకున్నారు. ఈ టైమ్ లో శంబాలతో అతని దశ తిరిగింది. ఈ మూవీ కోసం అతను పడ్డ కష్టాన్ని మర్చిపోయేలా చేశాడు. సూపర్ హిట్ అంటూ ఆడియన్స్ కూడా యూనానిమస్ గా డిక్లేర్ చేశారు. కథ, కథనాలు ప్రధానంగా అతని కోసం రాసుకున్న కథలాగా కాకుండా.. కేవలం కంటెంట్ ను మాత్రమే నమ్ముకున్న మూవీలా కనిపించింది. క్రిస్మస్ రోజున విడుదలైన ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చిందంటే కారణం దర్శకుడు కూడా. దర్శకుడు యుగంధర్ ముని ఈ కథను మాత్రమే అలా ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం సూపర్బ్ అనిపించాడు.
శంబాల పాత్రలన్నీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అదే సినిమాకు మరో ప్లస్ అయింది. హీరోగా ఆదికి సరిపోయేలా కథను కూడా సెట్ చేయడం మరో ప్లస్ అయింది. నాస్తికుడు, ఆస్తికుడు నేపథ్యంలో రూపొందిన అతని పాత్ర బాగా ప్లస్ అయింది. అతనితో పాటు శ్వాసిక విజయ్, హర్షవర్ధన్, రవి వర్మ, మధునందన్ పాత్రలు కూడా బావున్నాయి. మొత్తంగా ఇన్నేళ్ల ఫ్లాప్స్ తర్వాత ఆది ఈ మూవీతో సూపర్ హిట్ అందుకోవడం మాత్రం బావుంది. ఇకపై అతని నుంచి మంచి కథలే వస్తాయి అనేలా భావించేలా చేశాడు. ఆచితూచి కథలు ఎంచుకోవాలనే వార్నింగ్ కూడా కనిపిస్తుంది. ఇకపై ఏదొస్తే అది చేయకూడదు అనిపించేలా చేశాడు. సాయి కుమార్ కూడా పుత్రానందంతో బాగా హ్యాపీగా ఉన్నాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

