Aadi Saikumar : ఆది సాయికుమార్.. ఇదైనా హిట్ అవుతుందా..?

టాలీవుడ్ లో ఇప్పుడంతా దాదాపు వారసత్వ హీరోలదే హవా. టాప్ హీరోల నుంచి టైర్ 3 హీరోల వరకూ వాళ్లదే హవా. ఆ కోవలోనే వచ్చిన హీరో ఆది సాయి కుమార్. సాయి కుమార్ వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన ప్రేమ కావాలి, లవ్ లీ అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. మంచి డ్యాన్సర్. కండలు పెంచాడు. దీంతో కుర్రాడు త్వరగానే టైర్ టూ హీరోస్ లిస్ట్ లో ఎంటర్ అవుతాడు అనుకున్నారు. బట్ ఇక్కడే అతనికి లక్ అడ్డం తిరిగింది. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపించలేదు. వరసగా అన్నీ పోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం తన కటౌట్ ను దాటి మాస్ హీరోగా మెప్పించాలని చేసిన ప్రయత్నాలే అంటారు చాలామంది. అదీ నిజమే మాస్ హీరోల రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ చూసుకున్నాడు కానీ.. వాటికి కనెక్ట్ అయ్యే కంటెంట్ ను సెలెక్ట్ చేసుకోలేకపోయాడు. అందుకే ఆది గ్రాఫ్ ప్రస్తుతం పూర్తిగా పడిపోయింది. దాదాపు ఫేడవుట్ అయినట్టే అని అంతా అనుకుంటోన్న టైమ్ లో వచ్చిన ఒక కొత్త పోస్టర్ చాలామందిలో ఆసక్తిని పెంచింది. ఆదికి ఇది రీ లాంచ్ అవుతుందనే నమ్మకాన్నిచ్చింది. అదే ‘శంబాల’.
యుగంధర్ ముని అనే దర్శకుడు రూపొందించబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ఆది లేడు. కానీ ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ను చూపించబోతున్నాం అనేలా దర్శకుడు రూపొందించిన పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ తరహా కంటెంట్ కు మంచి వాల్యూ ఉంది. ఈ దర్శకుడి బ్యాక్ గ్రౌండ్ స్ట్రాంగ్ గానే ఉంది. అంటే వారసత్వ దర్శకుడు అని కాదు.. అంతర్జాతీయ స్థాయి ఉన్న వాడు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మద్దూరి కూడా అలాంటివాడే. అనేక హాలీవుడ్ మూవీస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో కీలకంగా పనిచేశాడు. క్వాలిటీ పరంగా దర్శకుడు ది బెస్ట్ ను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. త్వరలోనే షూటింగ్ కు వెళ్లబోతోన్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఈ మధ్య కాలంలో ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఇదే అని చెప్పాలి. అందుకే శంబాల ఆది సాయి కుమార్ కు రీ లాంచ్ అవుతుందంటున్నారు. ఒకవేళ ఈ మూవీ కూడా కాపాడలేకపోతే ఆది కెరీర్ ఆల్మోస్ట్ ఖతమైపోయినట్టే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com