Aadi Saikumar's Shambhala : ఓటిటిలోకి శంబాల

Aadi Saikumars Shambhala :  ఓటిటిలోకి శంబాల
X

ఆది సాయికుమార్ హీరోగా నటించిన మూవీ శంబాల. ఈ మూవీపై ముందు నుంచీ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. చాలా రోజులు ముందుగానే ట్రైలర్ విడుదల చేశారు. భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. తీరా చూస్తే రిలీజ్ టైమ్ కు చాలా పెద్ద పోటీ వచ్చింది. అయినా ఆ పోటీలో శంబాల నిలబడింది. గెలిచింది. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన శంబాల బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆదికి ఈ మూవీ కమ్ బ్యాక్ అని కూడా చెప్పుకున్నారు. అన్ని రివ్యూస్ కూడా పాజిటివ్ గా వచ్చాయి. దీంతో క్రిస్మస్ కు విడుదలైన అన్ని చిత్రాల్లోకీ పెద్ద విజయం అందుకుంది శంబాల.

లిమిటెడ్ బడ్జెట్ తో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించింది శంబాల. యుగంధర్ ముని దర్శకత్వంపై చాలా ప్రశంసలు వచ్చాయి. ఆస్తికుడికి, నాస్తికుడికి మధ్య సాగే పోరాటం.. ఆపై అనేక ప్రశ్నలకు ఆస్తికుల నుంచి వచ్చిన సమాధానాలు.. ఇవన్నీ కూడా హైలెట్ అయ్యాయి. ఆదికి మాత్రం చాలా చాలా ప్లస్ అయింది ఈ మూవీ. ఇండస్ట్రీలో చాలామంది నుంచి ఈ మూవీకి అప్లాజ్ వచ్చింది. దీంతో కన్నడ, హిందీలో కూడా డబ్బింగ్ అవుతుందీ మూవీ. ఈ టైమ్ లో ఓటిటిలోకి రావడం మాత్రం చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది.

అర్చనా అయ్యర్, శ్వాసిక విజయ్, మధునందన్, రవి వర్మ, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ వంటి వారు నటించిన శంబాల చిత్రం ఓటిటి ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఈ నెల 22నుంచి ఈ మూవీ స్ట్రీమ్ కాబోతోంది. రిలీజ్ తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అన్నీ మరోసారి ఓటిటి తర్వాత కూడా రిపీట్ అవుతాయి అనే నమ్మకం ఉంది. మొత్తంగా ఈ మూవీతో ఆహాకు కూడా ప్లస్ పాయింట్ కాబోతోంది. మరి ఓటిటిలో ఎలాంటి అప్లాజ్ వస్తుందో చూడాలి.

Tags

Next Story