Aadivi Sesh : అడవి శేష్ గూఢచారి 2 కు ఏమైంది..?

మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ కమ్ రైటర్ గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు అడివి శేష్. సినిమా పట్ల చాలా డెడికేషన్ తో కనిపిస్తాడు. కమిట్ అయిన ప్రాజెక్ట్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాడు. హీరోగానే కాక రైటింగ్ లోనూ తనదైన ముద్ర చూపిస్తాడు. ప్రమోషన్స్ లో సైతం ఆకట్టుకుంటాడు. మరి ఇన్ని ప్లస్ పాయింట్స్, స్పెషల్ క్వాలిటీస్ ఉన్న హీరో నుంచి ఓ సినిమా బాగా ఆలస్యం అవుతుందంటే ఎవరికైనా రకరకాల అనుమానాలు కలుగుతాయి. 2017లో వచ్చిన అమీతుమీ నుంచి అప్రతిహతంగా దూసుకుపోతున్నాడు శేష్. 2018లో తన రైటింగ్, శశికిరణ్ డైరెక్షన్ లో రూపొందిన ‘గూఢచారి’చూసి ఎంటైర్ ఇండస్ట్రీ షాక్ అయింది. వెరీ లిమిటెడ్ బడ్జెట్ తో అతను ఓ ఎపిక్ లాంటి మూవీనే రూపొందించాడు. ఇదే అతని కెపాసిటీ.
అయితే గూఢచారికీ సీక్వెల్ ఉంటుందని అప్పుడే చెప్పారు. ఈ లోగా శేష్ తన మార్కెన్ ను పెంచుకున్నాడు. ప్రామిసింగ్ స్టార్ గా ఎదిగాడు. దీంతో గూఢచారి 2 కి ఈ సారి కావాల్సినంత బడ్జెట్ దొరుకుతుందనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈ ప్రాజెక్ట్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చింది. కొన్నాళ్ల క్రితమే షూటింగ్ కూడా ప్రారంభం అయింది. బట్ ఈ మూవీ షూటింగ్ సజావుగా సాగడం లేదని టాక్. అందుకు ప్రధాన కారణం నిర్మాణ సంస్థ ఆర్థికంగా సహకరించకపోవడమే అంటున్నారు. పీపుల్స్ మీడియా సంస్థ నుంచి వస్తోన్న సినిమాలన్నీ దాదాపుగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. అదీ కాక ప్రస్తుతం వీళ్లు ప్రభాస్ తో రాజా సాబ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అంచనా వేసిన దానికంటే డబుల్ బడ్జెట్ అవుతుందని టాక్. ఆ కారణంగానే ఇతర చిత్రాలకు ఇబ్బందులు పెరుగుతున్నాయట.
మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల మధ్య విభేదాలు కూడా తలెత్తాయని టాక్. ఇద్దరూ విడిపోతున్నారు కూడా. ఎవరికి వారు సొంతంగా సినిమాలు తీయాలనుకుంటున్నారు. ఇవన్నీ కలిసి గూఢచారి 2 కు ఇబ్బందిగా మారాయి. అందుకే ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి కావాల్సిన ఈ చిత్రం చాలా తక్కువ షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకుంది.
ఇక అటు డెకాయిట్ విషయంలో రీ షూటింగ్స్ జరుగుతుండటం వల్ల అదీ ఆలస్యం అవుతోంది. శ్రుతి హాసన్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో తీసుకున్న మృణాల్ ఠాకూర్ పై మరోసారి చిత్రీకరణ చేస్తున్నారు. ఏదేమైనా ఎంతో ప్రతిభ ఉన్నా శేష్ మూవీస్ ఇలా ఆలస్యం కావడం ఆశ్చర్యం అనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com