ఎగతాళి చేశారు..అందగత్తెను కాదన్నారు- ఆమని

Aamani: టాలీవుడ్ సీనియర్ నటి ఆమని తన నటనతో, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జంబలకిడిపంబ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఆమని.. ఆ తర్వాత మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం వంటి పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి విజయాన్ని అందుకుంది. పెళ్లి తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకన్న ఆమని.. తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో సహాయ పాత్రలు పోషిస్తూ అలరిస్తుంది.
ఇటీవలే సీరియల్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాక.. మా కుటుంబానికి ఆ విషయం చెప్పాను. మా బంధువులందరూ విమర్శించారు. పెద్ద అందగత్తె ఏం కాదు'' అని అన్నారని ఆమని తెలిపారు.
ఆమని తల్లి, తన సోదరుడు ఉండగానే మరో ఇద్దరు అమ్మాయిలను పెంచుకుందని.. తన కంటే ఎక్కువ ప్రేమగా వాళ్లను చూసుకుంటారని తెలిపింది. చాలామంది వారిని చూసి తన కూతుర్లని అనుకున్నారని చెప్పుకొచ్చింది. ఐదేళ్ల నుంచి సినిమాలు అంటే పిచ్చి అని ఆ సమయంలోనే శ్రీదేవి, జయసుధలను తలుచుకుంటూ వారిలా ఎప్పుడు నటిస్తానో అని అనుకునేదాన్ని చెప్పుకొచ్చింది. ఇక జంబలకడి పంబ సినిమాలో మగవాళ్ళు ఆడవాళ్ళు ఉండేటట్లు నిజజీవితంలో జరగాలి అని.. అప్పుడే ఎందరో ఆడవాళ్ళ జీవితాలు బాగుంటుంది అంటూ ఫన్నీగా కామెంట్స్ చేసింది. దొంగిలించిన మామిడికాయలు తినడమంటే తనకెంతో ఇష్టమన్నారు.
ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షోలో ఆమని పాల్గొంది. ఈ షోలో ఆమనితోపాటు ఇంద్రజ కూడా పాల్గొన్నారు. ఎంట్రీ తోనే బాగా సందడి చేశారు. ఇక వీరిద్దరు కలిసి నటించిన సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com