ఆ పాపని నా కూతురే అనుకున్నారు.. ఈ విషయం ఎవరికీ తెలియదు. : ఆమని

ఆమని.. కళ్లతోనే భావాలు పలికించగలిగే అద్భుత నటి. స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాపు దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ పెళ్లాం, కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం, విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సూత్ర ధారులు.. ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.. ఆమె కెరీర్‌ని మలుపు తిప్పిని చిత్రాలు అనేకం.
ఐదేళ్ల వయసులోనే సినిమాల్లో నటించాలనే ఆసక్తి. అందుకే రోజుకో సినిమా చూస్తూ సినిమాల్లో నటించాలనే కోరికను మరింత పెంచుకుంది. హీరోయిన్‌గా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా చేసింది. ఓ ఏడాదిలో అయితే 11 చిత్రాలు చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన ఆమని అదే ఏడాది చేసిన మిస్టర్ పెళ్లాంకి నంది అవార్డ్ వచ్చిందని చెప్పింది.
కెరీర్ మొదలు పెట్టిన తొలి నాళ్లలో తనతో పాటు అమ్మ కూడా వచ్చేది. అయితే ఆమెతో పాటు వచ్చిన అయిదు నెలల పాపని చూసి ఇండస్ట్రీలోని వారంతా తన బిడ్డే అనుకున్నారట. కానీ ఆమని తల్లి అనాధ పిల్లలు ఇద్దరిని దత్తత తీసుకుని పెంచిందట. అందుకే ఆ పాపని తీసుకుని షూటింగ్‌కి వచ్చేది.
కానీ అందరూ అలా అడుగుతున్నారని అమ్మ షూటింగ్‌కి రావడం మానేసింది. దాంతో తానొక్కతే షూటింగ్‌కి వెళ్లేదట. అలా ఒంటరిగా వెళ్లడం అలవాటైంది. అదే విషయం నాగార్జున గారు అడిగారు.. అందరూ ఫ్యామిలీతో షూటింగ్‌కి వస్తారు.. నువ్వేంటి ఒక్కదానివే వస్తున్నావు అని అడిగితే ఈ విషయం చెప్పాల్సి వచ్చింది.. ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు అని ఆమని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com