Lokesh Kanagaraj : కూలీ దెబ్బకు సూపర్ హీరో అవుట్

ఏ ఇండస్ట్రీలో అయినా ఒక సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ మరో సినిమాపై ఖచ్చితంగా పడుతుంది. రీసెంట్ గా వచ్చిన కూలీ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. స్టార్ పవర్ వల్ల మరీ లాస్ లు పెరగలేదు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం కోలీవుడ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అంచనాలు పెట్టుకున్నారు. అలా జరగలేదు. ఈ మూవీ తర్వాత లోకేష్ కనకరాజ్ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తో ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఆ మేరకు అతను కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా ఆ మాట చెప్పాడు. పైగా అదో సూపర్ హీరో సినిమా అని కూడా చెప్పాడు. ఆ టైమ్ లో అతను చెప్పిన ఆర్డర్ చూస్తే కూలీ తర్వాత ఖైదీ 2, ఆపై ఆమిర్ మూవీ.. ఆ తర్వాత రోలెక్స్ ఉంటుందన్నాడు.
కూలీ డిజాస్టర్ కావడంతో లోకేష్ ఆర్డర్ మారిపోయింది. కొత్త సినిమాలు లైన్ లోకి వచ్చాయి. ఖైదీ 2 ను పక్కన పెట్టి ఇప్పుడు కమల్ హాసన్, రజినీకాంత్ లతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆ ఇద్దరు హీరోలు కూడా ఒప్పుకున్నారు. అలాగే ఆమిర్ ఖాన్ తో చేయాలనుకున్న ప్రాజెక్ట్ ను పూర్తిగా వదిలేశారు. అంటే ఫ్యూచర్ లో కూడా ఉండదు అన్నమాట. ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయినట్టే. ఇక రజినీ, కమల్ అంటే దేశవ్యాప్తంగా అంచనాలు ఉంటాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ పై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంది. మరి దీని తర్వాత ఖైదీ ఉంటుందా లేక అతను హీరోగా చేస్తున్న సినిమాపై ఎక్కువ ఫోకస్ పెడతాడా అనేది చూడాలి. మొత్తంగా కూలీ దెబ్బకు ఆమిర్ ఖాన్ సూపర్ హీరో సినిమా ఆగిపోయింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com