ఆమీర్-కిరణ్ మధ్యలో ఫాతిమా.. ఏంటి కత!!

ఆమీర్-కిరణ్ మధ్యలో ఫాతిమా.. ఏంటి కత!!
కారణమేదైనా నెటిజన్స్ అమీర్‌ని ఆడుకుంటున్నారు వారి ట్రోల్స్‌తో

సెలబ్రెటీలు పెళ్లి చేసుకున్నా వార్తే.. విడిపోయినా వార్తే. సామాజిక సందేశం ప్రధానంగా ఉన్నచిత్రాలు తీసే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వివాహ జీవితంలో వైఫల్యాలు ఎదురవుతున్నాయి. మొదటి భార్య రీనాతో 16 ఏళ్లు కలిసున్నాడు. రెండవ భార్య కిరణ్ రావుతో 15 సంవత్పరాల అనుబంధం తరువాత వారిద్దరూ విడిపోవాలనుకున్నారు. కారణమేదైనా నెటిజన్స్ అమీర్‌ని ఆడుకుంటున్నారు వారి ట్రోల్స్‌తో. దంగల్ హీరోయిన్ ఫాతిమాతో చెట్టపట్టాలే అమీర్ సంసారానికి చెదలు పట్టేలా చేసిందని అంటున్నారు.

హైదరాబాద్‌లో పుట్టిన ఫాతిమా సనా షేక్.. బాల నటిగా పలు హిందీ చిత్రాల్లో నటించింది. నువ్వు నేను ఒకటవుదాం అనే తెలుగు చిత్రంలో నటించిన ఫాతిమా బాలీవుడ్ చిత్రం దంగల్‌‌తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. 2016లో వచ్చిన దంగల్‌లో అమీర్‌ఖాన్‌కి కూతురిగా నటించిన ఫాతిమా.. ఆ వెంటనే వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్‌లో అమీర్‌కి జోడీగా నటించింది.

సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ముగిశాక కూడా ఇద్దరూ చాలా కాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. దీంతో వారిద్దరి జోడీపై రూమర్లు హల్ చల్ చేశాయి. చివరికి అంబానీ ఇంట జరిగిన పార్టీలకు, ఫంక్షన్లకు ఇద్దరూ జోడీగా కనిపించడంతో ఇప్పుడు కిరణ్ రావు-అమీర్‌ల విడాకులకు ఫాతిమానే కారణమనే టాక్ వినిపిస్తోంది.

2005 డిసెంబర్ 28న అమిర్, కిరణ్ వివాహం చేసుకున్నారు. సరోగసి ద్వారా 2011లో వీరికి బాబు పుట్టాడు. అమీర్, రీనాకి ఒక బాబు జునైద్, పాప ఐరా ఉన్నారు. కాగా, అమీర్ ఖాన్ కరీనా కపూర్ ఖాన్‌తో కలిసి 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో నటించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story