అమీర్ ఖాన్, కిరణ్ రావ్ పనిలో 'చాలా ప్రొఫెషనల్' .. రైటర్ స్నేహ దేశాయ్

అమీర్ ఖాన్, కిరణ్ రావ్ పనిలో చాలా ప్రొఫెషనల్ .. రైటర్ స్నేహ దేశాయ్
మాజీ భార్యాభర్తలు అమీర్ ఖాన్, కిరణ్ రావులు 'లపాటా లేడీస్' కోసం జతకడుతున్నారు.

మాజీ భార్యాభర్తలు అమీర్ ఖాన్, కిరణ్ రావులు 'లపాటా లేడీస్' కోసం జతకడుతున్నారు.2021లో విడాకులు తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ చిత్రానికి రైటర్ గా పని చేసిన స్నేహ దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమీర్ ఖాన్, కిరణ్ రావు వారిద్దరి మధ్య సమస్యలు ఏవి ఉన్నా అవి పని చేసేటప్పుడు కనపడనివ్వరు.. చాలా ప్రోఫెషనల్ గా పని చేస్తారని చెప్పారు.

అమీర్, కిరణ్ 15 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత 2021 లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. లగాన్ సెట్స్‌లో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. జూలై 2021లో మీడియాకు సంయుక్త ప్రకటనలో అమీర్, కిరణ్.. "ఇప్పుడు మేము కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాము. మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది - ఇకపై మేము భార్యాభర్తలుగా కాదు అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ మాజీ జంట లపాటా లేడీస్ కోసం జతకట్టారు. ఇద్దరు కొత్త వధువులు రైలులో కలుసుకున్నప్పుడు ఏమి జరుగుతుందో అనే వ్యంగ్య కథనం ఈ చిత్ర కథాంశం.

డిసెంబర్ 2023లో నూపుర్ శిఖ్రేతో ఇరా ఖాన్ వివాహానికి అమీర్, కిరణ్ కలిసి వేడుకల్లో భాగం పంచుకున్నారు. అమీర్‌ మొదటి భార్య రీనా దత్తాకు పుట్టిన ఇరా వివాహ వేడుకలకు హాజరైన కిరణ్ వారి కుటుంబ సఖ్యతను అభిమానులకు తెలియజేశారు. అయితే, మాజీలు ఒక ప్రాజెక్ట్‌లో సృజనాత్మకంగా కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు, రోజుల తరబడి కలిసి పనిచేసి, చిత్ర నిర్మాణ ప్రక్రియలో మునిగిపోయి, కథాకథనంలోని విభిన్న అంశాలను నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది రైటర్ స్నేహ దేశాయ్ పరిశీలించింది. సెట్స్‌లో ఉన్నప్పుడు అమీర్, కిరణ్ సినిమా పట్ల వారికి ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తారు. సీన్ బాగా వచ్చేందుకు చాలా కష్టపడతారు. అంతకు మించి వారి మధ్య మరో ఆలోచన ఉండదు అని తెలిపింది.

వారి మధ్య ఎలాంటి అభిప్రాయ బేధం రానివ్వకుండా, వారి సమస్యలను పక్కనపెట్టి సినిమా కోసం అంకితభావంతో పని చేస్తారని స్నేహ చెప్పారు. లపాటా లేడీస్ మార్చి 1న థియేటర్లలో విడుదల కానుండటంతో ఈ ఉల్లాసకరమైన కథ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లపాటా లేడీస్‌లో ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ్, నితాన్షి గోయెల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి కిరణ్ రావు దర్శకత్వం వహించగా, అమీర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే నిర్మాతలుగా వ్యవహరించారు. ఇది కిరణ్ రావు యొక్క రెండవ దర్శకత్వ వెంచర్, ఆమె చివరిగా 2011లో ధోబీ ఘాట్‌కి దర్శకత్వం వహించింది.

మరోవైపు, అమీర్ ఖాన్ చివరిసారిగా కరీనా కపూర్ ఖాన్ సరసన లాల్ సింగ్ చద్దాలో కనిపించారు. నటన నుండి కొంత విరామం తర్వాత , అమీర్ ఇప్పుడు సన్నీ డియోల్‌తో తన తదుపరి మెగా ప్రాజెక్ట్ లాహోర్ 1947 షూటింగ్‌లో ఉన్నాడు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story