అమీర్ మాజీ భార్యలు.. ఆప్యాయపు పలకరింపులు..

అమీర్ మాజీ భార్యలు.. ఆప్యాయపు పలకరింపులు..
X
మన్సూర్ ఖాన్ పుస్తకావిష్కరణలో అమీర్ ఖాన్, కుమారుడు జునైద్, మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తా ఒకరికొకరు ఆప్యాయంగా పలకిరించుకున్నారు.. ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు.

మన్సూర్ ఖాన్ పుస్తకావిష్కరణలో అమీర్ ఖాన్, కుమారుడు జునైద్, మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తా ఒకరికొకరు ఆప్యాయంగా పలకిరించుకున్నారు.. ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో అమీర్ ఖాన్, కొడుకు జునైద్ తో కలిసి సంతోషంగా ఫోటోకు ఫోజులిచ్చారు.

అమీర్ ఖాన్ నిన్న సాయంత్రం ముంబైలో జరిగిన తన కజిన్ చిత్రనిర్మాత మన్సూర్ ఖాన్ (1988లో వచ్చిన చిత్రం ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రానికి దర్శకత్వం వహించారు ) పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన వెంట కుమారుడు జునైద్ కూడా ఉన్నాడు. ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్ మాజీ భార్యలు కిరణ్ రావ్ మరియు రీనా దత్తా కూడా వచ్చారు. ఒకరికొకరు కౌగిలించుకుని, ఆప్యాయంగా పలకరించుకున్నారు రీనా, కిరణ్.

గత సంవత్సరం, కరణ్ జోహార్ యొక్క చాట్ షోలో, అమీర్ ఖాన్ తన కుటుంబం గురించి చెప్పాడు. "మేమంతా ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారానికి ఒకసారి అందరం కలిసిపోతాము. ప్రతి ఒక్కరి పట్ల నిజమైన శ్రద్ధ, ప్రేమ, గౌరవం ఉన్నాయి. వారిద్దరి పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది అని రీనా, కిరణ్ గురించి చెప్పారు. మేము ఎల్లప్పుడూ ఒక కుటుంబంగా ఉంటాము." అని కరణ్ జోహార్ కార్యక్రమంలో చెప్పారు.

అమీర్ ఖాన్, కిరణ్ రావు 15 సంవత్సరాల వివాహ జీవితానికి ముగింపు పలికారు. జూలై 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. కిరణ్ రావును 2005లో వివాహం చేసుకున్నారు 2011లో వారికి ఒక కుమారుడు ఆజాద్‌ జన్మించాడు. కిరణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న లగాన్ సెట్స్‌లో అమీర్ ఆమెను కలిశాడు. వీళ్లిద్దరు లాల్ సింగ్ చద్దాలో కూడా కలిసి పనిచేశారు , దీనిని కిరణ్ రావు సహ-నిర్మాతగా కూడా వ్యవహరించారు.

అమీర్ ఖాన్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఇరా, జునైద్ ఉన్నారు. ఇరా సంగీతాన్ని అభ్యసించింది, జునైద్ తండ్రి అమీర్ ఖాన్‌కు చిత్ర నిర్మాణంలో సహాయం చేస్తాడు.

Tags

Next Story