Ira-Nupur Wedding: క్రిస్టియన్ పద్దతిలో అమీర్ ఖాన్ కూతురి పెళ్లి

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్, నుపుర్ శిఖరేల వివాహం జనవరి 10న ఉదయపూర్‌లో జరిగింది. జనవరి 3న, ఇరా ముంబైలో నూపూర్‌తో రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది, ఆ తర్వాత ఐరా ఉదయపూర్‌లో నూపూర్‌తో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. సిటీ ఆఫ్ లేక్స్‌లో గత కొన్ని రోజులుగా అనేక వివాహ కార్యక్రమాలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటి వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు, ఇరా - నూపూర్ వివాహానికి సంబంధించిన తాజా చిత్రాలు, వీడియోలు కొన్ని బయటికొచ్చాయి. దీని కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 10న ఉదయ్‌పూర్‌లోని ఆరావళి హిల్ హోటల్‌లో సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ పెళ్లి హిందూ లేదా ఇస్లాం సంప్రదాయ వేడుకల ప్రకారం నిర్వహించబడలేదు, వీరు క్రిస్టియన్- పద్దతిలో పెళ్లి చేసుకున్నారు.
ఈ వీడియోలో, ఇరా తెల్లటి పెళ్లి గౌను ధరించి కనిపించింది. మరోవైపు, నుపుర్ బో టైతో కూడిన లేత గోధుమరంగు ఫార్మల్ సూట్‌ను ధరించి కనిపించా. ఇరా రెడ్ కార్పెట్ మీద తన చేతుల్లో ఫ్లవర్ బొకేతో నుపుర్ చేయి పట్టుకుని వెళుతున్నట్లు కూడా వీడియోలో ఉంది.
పెళ్లి తర్వాత ఇరా-నూపూర్ రొమాంటిక్ డ్యాన్స్
ఇరా ఖాన్ - నుపుర్ శిఖరే మరొక వీడియో కూడా వైరల్ అవుతోంది, ఇందులో వారి క్రిస్టియన్ పెళ్లి తర్వాత ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఈ నవ దంపతులు ఒకరి ఒకరు ప్రేమలో మునిగిపోయినట్టు కనిపించార
నుపుర్ శిఖరే ఫిట్‌నెస్ కోచ్, అమీర్ ఖాన్, సుస్మితా సేన్‌తో సహా అనేక మంది ప్రముఖులకు శిక్షణ ఇచ్చారు. అతను కరోనావైరస్ లాక్డౌన్ సమయంలో ఇరాను కలుసుకున్నాడు. ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఈ జంట తమ ప్రేమను సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఎప్పుడూ దూరంగా ఉండలేదు. కాగా వీరు 2022 నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.
Most Unique Wedding which is under celebration at Udaipur features Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare ❤️ White Wedding 🤍#AamirKhan #NupurShikhare #IraKhan #ReenaDutta #KiranRao #Bollywood #IraKhanWedding #CelebrationTour #celebrity #Udaipur #Celebrities #viral pic.twitter.com/BzXuqn2mCc
— sdn (@sdn7_) January 10, 2024
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com