19 ఏళ్లకే ప్రపంచానికి వీడ్కోలు పలికిన అమీర్ ఖాన్ చిన్న కూతురు.. దంగల్ నటి కన్నుమూత

19 ఏళ్లకే ప్రపంచానికి వీడ్కోలు పలికిన అమీర్ ఖాన్ చిన్న కూతురు.. దంగల్ నటి కన్నుమూత
దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ చిన్న కూతురు బబిత పాత్రను పోషించిన నటి సుహానీ భట్నాగర్ కన్నుమూశారు.

దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ చిన్న కూతురు బబిత పాత్రను పోషించిన నటి సుహానీ భట్నాగర్ కన్నుమూశారు. కేవలం 19 ఏళ్ల వయసులో సుహానీ భట్నాగర్ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. ఫరీదాబాద్ నివాసి అయిన సుహాని భట్నాగర్ మరణానికి కారణం శరీరం మొత్తం నీరు పట్టింది. కొంతకాలం క్రితం సుహానీ భట్నాగర్ ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె కాలుకు ఫ్రాక్చర్ అయింది. సుహాని ట్రీట్‌మెంట్ కోసం తీసుకున్న మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో క్రమంగా ఆమె శరీరంలో మార్పులొచ్చాయి. ఆమె చాలా కాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందింది.

సుహాని భట్నాగర్ బాలీవుడ్‌లో సుప్రసిద్ధ చైల్డ్ ఆర్టిస్ట్. ఆమె అమీర్ ఖాన్ యొక్క బ్లాక్ బస్టర్ చిత్రం ' దంగల్ ' (2016) లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ఆమె జూనియర్ బబితా ఫోగట్ పాత్రను పోషించింది. చాలా టీవీ యాడ్స్‌లో కూడా సుహానీ పనిచేసింది.

సుహాని భట్నాగర్ సినిమాలకు ఎందుకు దూరంగా ఉంది?

' దంగల్ ' తర్వాత , సుహాని భట్నాగర్‌కి సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ నటి పని నుండి విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ముందు చదువుపై దృష్టి పెట్టాలనుకుంది. చదువు తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తానని సుహాని చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది

సుహాని భట్నాగర్ 25 నవంబర్ 2021 నుండి Instagram ఖాతాలో యాక్టివ్‌గా లేరు. అయితే, దీనికి ముందు ఆమె తరచుగా తన ఫోటోలను పంచుకునేది. సుహాని ఎదిగిన తరువాత ఆమె లుక్స్ చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ఆమె మునుపటి కంటే మరింత గ్లామర్‌గా మారింది. హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోని అందం సుహానీలో ఉందని అనుకునే వారు. కానీ ఆమె ఈ రోజు ప్రపంచం నుండి నిష్క్రమించింది.

Tags

Next Story