కూతురు పెళ్లిలో అమీర్ స్పెషల్ అట్రాక్షన్.. మాజీ భార్యకు ముద్దులు

కూతురు పెళ్లిలో అమీర్ స్పెషల్ అట్రాక్షన్.. మాజీ భార్యకు ముద్దులు
అమీర్ ఖాన్ కుమార్తె, ఇరా ఖాన్, ఫిట్‌నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేను జనవరి 3న సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

అమీర్ ఖాన్ కుమార్తె, ఇరా ఖాన్, ఫిట్‌నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేను జనవరి 3న సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. మొదటి భార్య రీనా దత్తా, రెండవ భార్య కిరణ్ రావ్‌లతో సహా తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వివాహ వేడుకలను అత్యంత వైభవంగా జరిపించారు.

ఫిట్‌నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేతో కుమార్తె ఇరా ఖాన్ పెళ్లి తర్వాత అమీర్ ఖాన్ హ్యాపీ డాడ్‌గా నిలిచాడు. సూపర్ స్టార్ నూతన వధూవరులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు. మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు, కుమారులు జునైద్, ఆజాద్, నూపుర్ తల్లి కూడా పాల్గొన్నారు. ఈ ఆనందంలో అమీర్ మాజీ భార్య కిరణ్‌ చెంపపై ముద్దుపెట్టి ఆమెను ఆశ్చర్యపరిచాడు.

అమీర్ కిరణ్ దగ్గరకు ఏదో చెప్పడానికి వెళ్లి మాట్లాడుతూ ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాజీ భార్యను మర్చిపోలేకపోతున్నాడు.. చక్కగా ఉన్నారు. కలిసి ఉండొచ్చుకదా.. ఎందుకు విడిపోయినట్లు అని పోస్టులు పెడుతున్నారు.

ఇరా-నూపూర్

అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన చిరకాల భాగస్వామి నుపుర్ శిఖరేను వివాహం చేసుకుంది. వేడుక కోసం ఇరా సంప్రదాయ దుస్తులలో కనిపించింది, అయితే నుపుర్ క్యాజువల్ అథ్లెజర్‌ను ఎంచుకున్నారు - షార్ట్‌తో జాగింగ్ చేసి వచ్చి అదే డ్రెస్ తో సంతకం చేశారు. వివాహ నమోదు తరువాత, వారు ఫోటోలకు పోజులిచ్చారు. నుపుర్ ముదురు నీలం రంగు షేర్వానీ ధరించాడు.

ముంబైలోని బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. వారు త్వరలో ఉదయపూర్‌కు బయలుదేరి వెళతారు, అక్కడ జనవరి 8న గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేయబడింది. దీని తర్వాత జనవరి 13న ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఈ స్టార్ రిసెప్షన్‌కు బాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story