Ahimsa : హింసతో కూడిన 'అహింస' ఫస్ట్ లుక్.. రానా తమ్ముడి ఎంట్రీ అదిరిందిగా..!

Ahimsa : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు, హీరో రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.. దర్శకుడు తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రోజు తేజ పుట్టినరోజు సందర్భంగా అభిరామ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఓక గోనె సంచిలో అభిరామ్ మొహన్ని కట్టేసి బాగా రక్తం కారుతున్నట్టుగా చూపించారు. హింసతో కూడిన పోస్టర్‌ని చూపిస్తూ అహింస అనే టైటిల్‌ని పెట్టడం విశేషం. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
అహింసా పరమో ధర్మః,
— BA Raju's Team (@baraju_SuperHit) February 22, 2022
ధర్మహింసా తధైవచ !!
Presenting the Fierce Pre Look Poster of #AbhiramDaggubati's #AHIMSA 🩸
A Film by @tejagaru 🎬
Principal Shoot Completed #Kiran @rppatnaik #SameerReddy @boselyricist @AnandiArtsOffl
#HappyBirthdayTeja pic.twitter.com/LGrtZXLatu
ఇందులో బాలీవుడ్ నటుడు రజత్ బేడీ మెయిన్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. అభిరామ్‌కి జోడీగా గీతిక తివారీ నటిస్తోంది. సినిమా రిలీజ్ డేట్‌ని త్వరలోనే అనౌన్సు చేయనున్నారు. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా పైన మంచి అంచనాలు పెచేశారు తేజ, అభిరామ్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com