Abhiram Daggubati: తమిళ సూపర్ హిట్ రీమేక్‌లో అభిరామ్.. దగ్గుబాటి హీరో లాంచ్‌కు ముహూర్తం ఖరారు..

Abhiram Daggubati (tv5news.in)
Abhiram Daggubati: దగ్గుబాటి హీరోలంటే టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా పెద్దగా కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా, ఎప్పుడూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు ఈ హీరోలు. నిర్మాతలుగా ఉన్న కుటుంబం నుండి ముందు హీరోగా ఎంట్రీ ఇచ్చారు వెంకటేశ్. ఆ తర్వాత రానా, ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్.
వెంకటేశ్ తర్వాత హీరోగా వచ్చిన రానా.. కేవలం టాలీవుడ్‌ను మాత్రమే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్.. అన్ని పరిశ్రమలను చుట్టేశాడు. నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే హీరో పాత్రలు చేస్తే చాలదని.. విలన్‌గా కూడా అవతారమెత్తాడు. ఎప్పటికప్పుడు విభిన్న కథలను ఎంచుకుంటూ.. ఉన్నతస్థాయికి వెళ్తున్నాడు. ఇప్పుడు తన తమ్ముడు అభిరామ్‌ను హీరోగా లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.
దగ్గుబాటి అభిరామ్ సినీ ఎంట్రీ గురించి ఎప్పటినుండో టాలీవుడ్‌లో చర్చలు నడుస్తున్నాయి. వెంకటేశ్ హీరోగా నటించిన 'నారప్ప'తో అభిరామ్ మొదటిసారి స్క్రీన్‌పై మెరవనున్నాడని రూమర్స్ వినిపించినా.. అవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ప్రస్తుతం ఓ తమిళ సూపర్ హిట్ సినిమా రీమేక్‌తో అభిరామ్ ఎంట్రీ ఉండనుందని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల తమిళంలో విడుదలయ్యి సూపర్ హిట్‌ను సాధించిన సినిమా 'మానాడు'. శింబు ఇందులో హీరో. అయితే ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో విడుదల చేయాలనుకున్న టీమ్.. మనసు మార్చుకుని రీమేక్ రైట్స్‌ను సురేశ్ ప్రొడక్షన్స్‌కు అమ్మేసింది. అయితే ఈ సినిమాలో హీరోగా అభిరామ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కానున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మానాడు చిత్రం చూసిన కొందరు దగ్గుబాటి ఫ్యాన్స్.. అభిరామ్ ఎంట్రీకి ఇదే కరెక్ట్ మూవీ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com