Abhiram Daggubati: దర్శకుడి మాట వినని దగ్గుబాటి హీరో.. షూటింగ్‌కు రాకుండా..

Abhiram Daggubati (tv5news.in)
Abhiram Daggubati: దగ్గుబాటి హీరోలంటే చాలామంది ప్రేక్షకులకు ఇష్టం. తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా నెగిటివిటీ లేని హీరోలంటే వీళ్లే. అయితే త్వరలోనే దగ్గుబాటి ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమం కానున్న రానా తమ్ముడిపై అప్పుడే నెగిటివిటీ వచ్చేస్తోంది. తాజాగా తను తన డెబ్యూ సినిమా గురించి పెద్దగా పట్టించుకోవట్లేదనే రూమర్ ఫిల్మ్ సర్కి్ల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
దగ్గుబాటి అభిరామ్ త్వరలోనే తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అహింస' చిత్రంతో హీరోగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదలయ్యి అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఎప్పుడో ప్రారంభమయినా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇప్పటివరకు కోవిడ్ వల్ల అహింస షూట్‌కు బ్రేక్ పడితే.. ఇప్పుడొక కొత్త సమస్య వల్ల సినిమా ఆలస్యం అవుతుందని టాక్ వినిపిస్తోంది.
కోవిడ్ నిబంధనల తర్వాత అహింస షూటింగ్ ప్రారంభమయ్యింది. అయితే కొన్నిరోజుల క్రితం దగ్గుబాటి అభిరామ్‌కు షూటింగ్‌కు రమ్మని తేజ ఫోన్ చేయగా కాలికి గాయం తగిలిందని, రెస్ట్ తీసుకుంటానని తెలిపాడట. దీంతో తేజ షూటింగ్ క్యాన్సిల్ చేశాడట. ఆ తర్వాత తేజకు ఓ షాకింగ్ విషయం తెలిసిందట.
నిజానికి అభిరామ్ కాలికి ఎలాంటి గాయం జరగలేదని, తను ఇంట్లో ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటున్నట్టు డైరెక్టర్ తేజకు తెలిసిందట. దీంతో తేజ అసహనానికి లోనయ్యాడట. అంతే కాకుండా ఈ విషయాన్ని అభిరామ్ తండ్రి సురేశ్ బాబు దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాడట. అయితే ఈ కథనాల్లో ఎంత నిజముందో తెలియదు కానీ.. గత కొన్నిరోజులుగా ఫిల్మ్ సర్కి్ల్స్‌లో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com