Nani : అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ పాటతో హిట్ 3 ట్రైలర్ డేట్ అనౌన్స్

Nani :  అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ పాటతో హిట్ 3 ట్రైలర్ డేట్ అనౌన్స్
X

నేచురల్ స్టార్ నుంచి మాస్ మసాలా స్టార్ గా మారుతున్నాడు. ఈ క్రమంలోనే తన స్క్రిప్ట్ సెలెక్షన్ కనిపిస్తోంది. తన ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించిన హిట్, హిట్ 2 తర్వాత తనే ఇప్పుడు ఆ ఫ్రాంఛైజీలో నటిస్తోన్న మూవీ హిట్ 3.. ద థర్డ్ కేస్. శేలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయబోతున్నాడు. దసరా నుంచి ప్యాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసిన నాని ఈ మూవీని కూడా అదే స్థాయిలో విడుదల చేయబోతున్నాడు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ అనే పాటను విడుదల చేశారు. దీంతో పాటు ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా చెప్పాడు నాని.

ఈ పాట చూస్తే అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను తెలియజేసేలా ఉంది. పూర్తిగా రక్తపాతంతో కనిపిస్తోంది. నానిలోని మాస్ యాంగిల్ ను మరో స్థాయిలో చూపించబోతున్నారని ఈ పాటతోనే అర్థం అవుతుంది.

‘వేటు వేసినా వేట సాగెలే.. గీత గీసినా కోత మారునా నేడే.. మాటు వేసినా ఆపడే ఇదే.. యాడ దాగినా.. అలవలే ఎగసెలే.. భయమలే బిగిసెలే.. ’ అంటూ

సాగే ఈ గీతాన్ని కృష్ణకాంత్ రాయగా మిక్కీ జే మేయర్ స్వరకల్పనలో అనురాగ్ కులకర్ణి పాడాడు. పాటంతా ఇంటెన్సిటీతో నిండి ఉంది. సినిమాలో మాంటేజ్ సాంగ్ లా ఉండే అవకాశం ఉంది.

ఇక ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 14న విడుదల చేయబోతున్నాం అని చెప్పాడు నాని. అన్ని నరకాలను ఏప్రిల్ 14న బద్ధలు కొట్టబోతున్నా అనే అర్థం వచ్చేలా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో నాని తనలోని మాస్ యాంగిల్ ను మరో కోణంలో చూపించబోతున్నాడని మాత్రం అర్థం అవుతోంది.

Tags

Next Story