Hero Karthi కార్తీ షూటింగ్ లో ప్రమాదం.. వ్యక్తి మృతి

Hero Karthi కార్తీ షూటింగ్ లో ప్రమాదం.. వ్యక్తి మృతి
X
తమిళ్ హీరో కార్తి మూవీ సర్దార్ 2 షూటింగ్ లో ప్రమాదం. ఫైటర్ మృతి.

తమిళ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటిస్తోన్న సర్దార్ 2 మూవీ షూటింగ్ లో జరిగిన ఓ ప్రమాదంలో 20మీటర్ల ఎత్తు నుంచి కింద పడిన ఓ ఫైటర్ అక్కడిక్కడే చనిపోవడం విషాదాన్ని మిగిల్చింది. కార్తీ డ్యూయెల్ రోల్ లో నటించిన సినిమా సర్దార్. పిఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్ గా సర్దార్ 2 సినిమా రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు జరుపుకుని ప్రారంభం అయింది. తాజాగా తమిళనాడులోని ఓ స్టూడియోలో భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏళుమలై అనే ఫైటర్ 20 మీటర్ల ఎత్తు నుంచి బ్యాలన్స్ కోల్పోయి కింద పడిపోయాడు. దీంతో అతను స్పాట్ లోనే చనిపోయాడు. అంతెత్తు నుంచి పడిపోవడం వల్ల అతని శరీరంలోపల అనేక భాగాలు డామేజ్ కావడం వల్లే చినిపోయాడని డాక్టర్లు నిర్దారించారు. ఘటనకు సంబంధించి పోలీస్ లకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు హీరో కార్తీ కూడా సెట్స్ లోనే ఉన్నాడని చెబుతున్నారు. ప్రమాదం తర్వాత పోలీస్ లు వచ్చే వరకూ వేచి చూసిన అతను బాడీని హాస్పిటల్ తీసుకువెళ్లే వరకూ ఉండి వెళ్లిపోయాడటంటున్నారు.

నిజానికి ఫైటర్స్ కు సంబంధించి అంత ఎత్తు నుంచి షూటింగ్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతుంటాయి. విషాదం ఏంటంటే.. సినిమా షూటింగ్స్ లో ప్రమాదాలన్నీ ఎక్కువగా ఫైటర్స్ కే జరుగుతుంటాయి.

Tags

Next Story