Acharya- Bheemla Nayak : ఆచార్య, భీమ్లా నాయక్ కొత్త రిలీజ్ డేట్స్ ఇవే..!

Acharya- Bheemla Nayak : కొద్దిసేపటి క్రితమే ఆర్‌ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్‌ని మేకర్స్ అనౌన్స్ చేయడంతో.. మిగిలిన సినిమాలు కూడా కొత్త రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నాయి. చిరంజీవి హీరోగా వస్తోన్న ఆచార్య, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రాల కొత్త రిలీజ్ డేట్స్‌ని సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ప్రకటించారు.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ఆచార్య మూవీని ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కాజల్ హీరోయిన్‌గా నటించింది.
#AcharyaOnApr29 ❤️🔥
— Konidela Pro Company (@KonidelaPro) January 31, 2022
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @KonidelaPro pic.twitter.com/NYy8UFFVG6
ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది. ఇందులో రానా మరో హీరోగా నటించాడు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' కి ఇది రీమేక్.
As we have always promised, #BheemlaNayak will be a massive theatrical experience. So, we have to wait for the pandemic to subside for presenting it in the theatres for you all.
— Sithara Entertainments (@SitharaEnts) January 31, 2022
We intend to release the movie on 25th February or 1st April, whenever the situation improves! pic.twitter.com/7DfEFTF9gp
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com