Acharya: 'ఆచార్య' నుండి ఫ్లాష్‌బ్యాక్ సీన్ లీక్.. నెటిజన్ల ట్రోల్స్..

Acharya: ఆచార్య నుండి ఫ్లాష్‌బ్యాక్ సీన్ లీక్.. నెటిజన్ల ట్రోల్స్..
Acharya: చిరంజీవి, రామ్ చరణ్ ఈ సినిమాలో ఎలా కలిశారు అనేది చాలా కీలకం.

Acharya: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ఆచార్య సినిమా ఎన్నో ఎదురుచూపుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం థియేటర్లలో ఆచార్య సందడి మొదలయ్యింది. మెగా అభిమానులంతా తమ హీరోల సినిమా విడుదల సందర్భంగా పండగ వాతావరణంలో ఉన్నారు. అయితే ఈ సినిమా నుండి ఓ ఫ్లాష్ బ్యాక్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దానిపై నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

చిరంజీవి, రామ్ చరణ్ ఈ సినిమాలో ఎలా కలిశారు అనేది చాలా కీలకం. అదే ఆచార్యలో మెయిన్ ఫ్లాష్ బ్యాక్. అయితే రామ్ చరణ్ చిన్నపిల్లాడిగా ఉన్న సమయంలో చిరంజీవి కూడా కాస్త వయసులో చిన్నగా కనిపించాలి. దీనికోసం వీఎఫ్ఎక్స్‌ను ఉపయోగించింది మూవీ టీమ్. దీంతో చిరంజీవి మొహం గుర్తుపట్టలేనట్టుగా అయిపోయింది.

ఆచార్య ఫ్లాష్ బ్యాక్ సీన్‌లో ఉంది అసలు చిరంజీవినేనా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ చిరు వయసులో చిన్నవారిగానే ఉంటారని, మరీ వీఎఫ్ఎక్స్ చేసి ఇలా చూపించాల్సిన అవసరం లేదని అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరికొందరు ఆ సీన్ చూసి అందులో ఉంది చిరంజీవి కాదని, తన డూప్ అని అంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ముందే లీక్ అయిన ఈ కీలకమైన సీన్‌కు ప్రేక్షకుల దగ్గర నుండి నెగిటివిటీ రావడం అభిమానులను బాధిస్తోంది.



Tags

Read MoreRead Less
Next Story