Acharya Release Date: మహేశ్ వదులుకున్న డేట్‌లో చిరు సినిమా..

Acharya Release Date: కరోనా విజృంభణ కారణంగా ఇప్పటికీ ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి. సంక్రాంతికి హోరాహోరీ పోటీని అంచనా వేసిన టాలీవుడ్ ప్రేక్షకులకు ఉన్నట్టుండి నిరాశ మిగిల్చాయి పాన్ ఇండియా సినిమాల వాయిదాలు. మెల్లగా సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్న సినిమాలన్నీ సమ్మర్ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మహేశ్ సినిమా కోసం బుక్ చేసుకున్న డేట్‌కు వెళ్లి చేసింది చిరు సినిమా.
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న మల్టీ స్టారర్ 'ఆచార్య'. ఈ సినిమా గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా అప్పటినుండి వాయిదా పడుతూ వచ్చింది. జనవరిలో సంక్రాంతి పోటీని కాదని.. ఫిబ్రవరీలో ఆచార్యను విడుదల చేయాలనుకుంది మూవీ టీమ్. కానీ ఇటీవల ఫిబ్రవరీలో కూడా విడుదల ఉండదని, వాయిదా వేస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
ముందుగా మహేశ్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' కూడా సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ మిగతా పాన్ ఇండియా సినిమాలు కూడా సంక్రాంతి విడుదలకే చూస్తుండడంతో సర్కారు వారి పాట స్వచ్ఛందంగా తప్పుకుని ఏప్రిల్ 1న విడుదల తేదీ అని ప్రకటించింది. కానీ ఇంకా షూటింగ్ పూర్తికాకపోవడంలో, మూవీ టీమ్‌లో చాలామందికి కరోనా సోకడంతో సర్కారు వారి పాట మరోసారి వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సమ్మర్ రేసులో ఇంకా సినిమాలు ఏవీ ఖరారు కాలేదు. ఉన్న ఒక్క సర్కారు వారి పాట కూడా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉండడంతో చిరంజీవి 'ఆచార్య'.. ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధమయ్యింది. కొత్త విడుదల తేదీతో ఉన్న ఆచార్య పోస్టర్‌ను కూడా మూవీ టీమ్ ఇటీవల విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com