Acharya: చిరు 152 స్పెషల్.. ట్రైలర్ విషయంలో వినూత్నంగా..

Acharya: మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ 151 సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన నటిస్తున్న 152వ చిత్రమే 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్యపై మెగా అభిమానులలో చాలా అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఇది చిరంజీవి, రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన చిత్రం. అయితే ఆచార్య ట్రైలర్ లాంచ్ కోసం మూవీ టీమ్ ఓ డిఫరెంట్ ఐడియాతో ముందుకొస్తోంది.
ఆచార్య సినిమా గతేడాదే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఇంతకాలం పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఇక ఫైనల్‌గా ఏప్రిల్ 29న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను ఏప్రిల్ 12న విడుదల చేయడానికి మూవీ టీమ్ నిర్ణయించుకుంది. ఇప్పటికే ఆచార్య టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే మెగా అభిమానులంతా ఆచార్య ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఆచార్య ట్రైలర్‌ను యూట్యూబ్‌లో పాటు థియేటర్లలో కూడా ఒకేసారి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. సాయంత్రం 5:49 ఆచార్య ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ విడుదల కోసం మూవీ టీమ్ ఓ డిఫరెంట్ ప్లాన్ వేసింది. ఇది ఎలాగో మెగాస్టార్ 152 మూవీ కావడంతో దేశవ్యాప్తంగా 152 థియేటర్లలో ఒకేసారి ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేటర్లతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని పలు థియేటర్లలో కూడా విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com