Acharya Trailer : ఆచార్య నుంచి బిగ్ అప్డేట్ .. ట్రైలర్ ఎప్పుడంటే..!

Acharya Trailer : ఆచార్య నుంచి బిగ్ అప్డేట్ .. ట్రైలర్ ఎప్పుడంటే..!
X
Acharya Trailer : చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఆచార్య మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది... ఈ సినిమా ట్రైలర్ ని ఏప్రిల్ 12న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు.

Acharya Trailer : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ఆచార్య.. కొరటాల శివ డైరెక్షన్‌‌‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రమిది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించి బిగ్ అప్డేట్ ని కొద్దిసేపటి క్రితమే ఇచ్చారు మేకర్స్.. ఆచార్య మూవీ ట్రైలర్‌‌‌‌ని ఏప్రిల్ 12 మంగళవారం రోజున రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించారు. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. రేజీనా ఓ స్పెషల్ సాంగ్‌‌‌లో మెరుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు కొరటాల.

Tags

Next Story