నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటపెట్టిన సాయి

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటపెట్టిన సాయి
టీవీ సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. దేవరాజురెడ్డి ఆరోపణలు చేసిన సాయి అనే వ్యక్తి... కీలక విషయాలు..

టీవీ సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. దేవరాజురెడ్డి ఆరోపణలు చేసిన సాయి అనే వ్యక్తి... కీలక విషయాలు బయటపెట్టాడు. దేవరాజురెడ్డి విడుదల చేసిన వీడియో అవాస్తవమని తెలిపాడు. శ్రావణి చనిపోయిందని తెలిసినప్పటి నుంచి మృతదేహం వద్దే ఉన్నానని ప్రకటించాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని వెల్లడించాడు. పోస్టు మార్టమ్‌ జరిగేటప్పుడు కూడా శ్రావణి కుటుంబం, పోలీసులతోనే ఉన్నట్టు తెలిపాడు. తాను శ్రావణి ఫ్యామిలీ స్నేహితుడినని చెప్పాడు.

అంతకుముందు.... శ్రావణి ఆత్మహత్యకు తాను కారణం కాదని దేవరాజురెడ్డి చెప్పాడు. శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి హింసించడం, కొట్టడం వల్లే.... అవమానం తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. శ్రావణి ఆత్మహత్య చేసుకునే ముందు తనకు ఫోన్ చేసిందని తెలిపాడు. అందువల్లే ఈ విషయం తనకు తెలిసిందని చెప్పాడు. ఇక ఆ ఇంట్లో ఉండలేనని చెప్పిందని వెల్లడించాడు.

శ్రావణి ఫోన్‌ చేసినప్పుడు... తనను ప్రేమిస్తున్నానని, తనతో పాటు వచ్చేస్తానని కూడా తెలిపిందని దేవరాజురెడ్డి చెప్పాడు. సాయి అనే వ్యక్తి... శ్రావణిని రోడ్డుపై జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టాడని.. ఈ విషయం శ్రావణే తనతో చెప్పిందని దేవరాజు తెలిపాడు. దాడి కారణంగా చాలా అవమానంగా ఉందని, తన చావుకు కారణం సాయి అనే వ్యక్తేనని... శ్రావణి చనిపోయే ముందు తనతో చెప్పిందని దేవరాజ్ వెల్లడించాడు.

సాయి అనే వ్యక్తి శ్రావణిని తన ముందే చంపాలని చూశాడని దేవరాజు అన్నాడు. పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతో శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజు వెల్లడించాడు. శ్రావణి కాల్ రికార్డింగ్‌లు పోలీసులకు ఇస్తానని స్పష్టంచేశాడు. గతంలో... తల్లిదండ్రుల ఒత్తిడితోనే శ్రావణి తనపై కేసు పెట్టిందని తెలిపాడు. ఎస్సార్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో పెళ్లి చేసుకోమని అడిగిందని.... తాను ఒప్పుకోకపోయేసరికి తనపై ఆరోపణలు చేస్తున్నారని వివరించాడు. తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని శ్రావణి తనతో చెప్పిందని దేవరాజు తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story