Nayanathara: సినిమాల్లో నటిస్తా.. కానీ కండిషన్స్ అప్లై అంటున్న నయన్..

Nayanathara: సినిమాల్లో నటిస్తా.. కానీ కండిషన్స్ అప్లై అంటున్న నయన్..
Nayanathara: వివాహం అయిన తరువాత నటనకు దూరమైన తారలు చాలా మందే ఉన్నారు.. కానీ ప్రస్తుత రోజుల్లో తారలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు..

Nayanathara: వివాహం అయిన తరువాత నటనకు దూరమైన తారలు చాలా మందే ఉన్నారు.. కానీ ప్రస్తుత రోజుల్లో తారలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.. మంచి పాత్రలు వస్తే నటిస్తామంటూనే ఒక్కోసారి గ్లామర్ రోల్స్ లో నటించడానిక్కూడా ఏమాత్రం వెనుకాడ్డం లేదు. కానీ సినిమాల్లో తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నయన్ మాత్రం గ్లామర్ రోల్స్ లో నటించేది లేదని స్పష్టం చేసింది.

డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ని వివాహం చేసుకున్న తరువాత నయన్ దర్శక నిర్మాతలకు కొత్త కండిషన్స్ పెట్టినట్లు కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై తనని సంప్రదించబోయే దర్శక నిర్మాతలు గ్లామర్ రోల్స్ కోసం కాకుండా ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో రావాలని కండీషన్ పెట్టిందట.

నిజానికి నయన్ గత కొంత కాలంగా గ్లామర్ రోల్స్ చేయట్లేదు.. తన పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తోంది. ఎక్కువ శాతం ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించింది. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పకపోయినా సెలెక్టెడ్ మూవీస్ చేయాలనుకుంటోంది.

ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు, తమిళ, హిందీకి సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. హిందీలో షారుఖ్ ఖాన్ తో జవాన్ చిత్రంలో నటిస్తోంది.. తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంలో చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.

Tags

Read MoreRead Less
Next Story