ఆ యాడ్ లో నటించినందుకు ట్రోల్స్.. : అబ్బాస్

ఆ యాడ్ లో నటించినందుకు ట్రోల్స్.. : అబ్బాస్
ఒక వస్తువు, ఒక ఉత్పత్తి ప్రజలకు చేరువ కావాలంటే ప్రకటన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

ఒక వస్తువు, ఒక ఉత్పత్తి ప్రజలకు చేరువ కావాలంటే ప్రకటన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది మామూలు వ్యక్తి చెప్పిన దానికంటే ఒక సినిమా సెలబ్రెటీనో, ఒక ప్రముఖ ఆటగాడో చెబితే బాగా ఎక్కుతుంది. అందుకే ప్రకటన కర్తలు యాడ్ లో నటించే వారికి కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి కూడా వెనుకాడరు. అలాగే అబ్బాస్ కూడా టాయ్ లెట్లు కడిగే హార్పిక్ యాడ్ లో నటించాడు.. ప్రేక్షకులు మాత్రం అతడి చర్యను తప్పు పట్టారు.. ట్రోల్స్ చేసి ఇబ్బంది పెట్టారు.

యాక్టింగ్ నుండి సుదీర్ఘ విరామం తీసుకొని న్యూజిలాండ్‌కు వెళ్లాడు నటుడు అబ్బాస్. తాను పరిశ్రమను ఎందుకు విడిచిపెట్టాను, యాడ్ చేసినందుకు తాను ఎదుర్కొన్న కష్టాలు, ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తమిళ నటుడు అబ్బాస్ చాలా కాలం తర్వాత తిరిగి వెలుగులోకి వచ్చాడు. కాదల్ దేశం, పడయప్ప, కందుకొండైన్ కందుకొండైన్ మరియు హే రామ్ వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాలలో నటించాడు. అతను 2015 తర్వాత నటనను విడిచిపెట్టాడు. నటుడు తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లి మధ్యతరగతి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు.

అక్కడి నుంచి ఈ మధ్య చెన్నై వచ్చిన అబ్బాస్ ను ఓ యూట్యూబ్ ఛానెల్ కలిసి ముచ్చటించింది. నటనకు దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో వివరించాడు. ఒకానొక సమయంలో నటన నాకు విసుగు తెప్పించింది. కొన్ని సంవత్సరాల తర్వాత రిలేషన్‌షిప్‌లో మీకు ఎలా సమస్యలు వస్తాయో, నా కెరీర్‌తో నాకు అదే సమస్య వచ్చింది. నాకు బోర్ కొడితే సహజంగానే ప్రేక్షకులు కూడా బోర్ ఫీలవుతారని గ్రహించాను. అందుకే ఇంకేదైనా చేయాలని నిర్ణయించుకున్నాను.

అప్పుడే న్యూజిలాండ్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. రెండు నెలల పాటు తన భవిష్యత్తును ప్లాన్ చేసుకున్నాడు. “మేము న్యూజిలాండ్‌లో వ్యాపారాన్ని ప్రారంభించాము. దానిని నా భార్య నిర్వహిస్తుంది. నాకు ఉద్యోగం రాకపోతే నా ఖాళీ సమయంలో నేను ఏం చేయాలా అని ఆలోచించాను. నేను భారతదేశంలో ఎప్పుడూ చేయని పనులు చేయాలని నిర్ణయించుకున్నాను. పని చేయడానికి ఏదీ దొరక్కపోతే ఆఖరికి క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం కూడా చేయాలనుకున్నాను.

న్యూజీలాండ్ లో నన్ను కొందరు గుర్తు పట్టి నేను అబ్బాస్ అని తెలిసి ఆశ్చర్యపోతారు. ప్రముఖ టాయిలెట్ క్లీనర్‌ను ప్రమోట్ చేసే అనేక ప్రకటనలలో భాగమయ్యాడు. అలాంటి ప్రకటనలలో నటించినందుకు అనేక YouTube ఛానెల్స్ ట్రోల్ చేశాయి. అయితే వాటిని తానేమీ పట్టించుకోలేదని తెలిపాడు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నేనేమీ వాటిని తాగమని చెప్పలేదుగా. బాత్రూంలో వాడండి అని చెప్పాను.. మీ ఇంటిని మురికిగా ఉంచుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. నేను చెప్పినదాంట్లో తప్పేముంది. టాయ్ లెట్ శుభ్రంగా ఉండాలంటే హార్పిక్ వాడమని చెప్పాను. అంతే కదా.

అయినా ఇందులో నేను బాధపడాల్సింది ఏమీ లేదు. ఒక మంచి పని చేశాను. తప్పు అర్థం చేసుకోవడం అనేది వారి ఇష్టం. అది వారి సంకుచిత మనస్థత్వానికి అద్ధం పడుతుంది. ఆ యాడ్ యాజమాన్యం నాతో ఎనిమిదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. నాకు మంచి రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. దాంతో నా కుటుంబంతో హాయిగా ఉన్నాను. నేను అన్ని వృత్తులను సమానంగా చూస్తాను. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసం కష్టపడుతుంటారు.

27 ఏళ్ల తర్వాత కూడా, ఐకానిక్ చిత్రం కాదల్ దేశంలోని ముస్తఫా ముస్తఫా పాట తమిళనాడులో స్నేహ గీతంగా కొనసాగుతోంది. అబ్బాస్ ఆ పాట షూట్ చేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ఊటీ చలిలో తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచేవాళ్లం. రూమ్‌కి కాఫీ వస్తుంది. అది తాగి వెంటనే షూటింగ్‌కి రెడీ అవ్వాలి. అక్కడ మూడు స్వెటర్లు ధరించినా చలికి తట్టుకోలేకపోయేవాళ్లం. కానీ షాట్ కోసం, మేము వాటన్నింటినీ తీసివేయవలసి వచ్చింది.

అబ్బాస్ మానసిక ఆరోగ్యంతో పోరాడుతున్నాడు. 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని చెప్పాడు. జీవితంలో అతిపెద్ద యుద్ధం తనతో తాను గడపక పోవడం అని చెప్పాడు. “మనం మనతో సమయం గడపము. మనం ఎవరో అర్థం చేసుకున్నాక సగం సమస్యలు తీరిపోతాయి. మీకు ఏమి కావాలో మీకు తెలిసినప్పుడు... కేవలం ఒక గంట, మీ కోసం అరగంట అయినా ఇవ్వండి." అని అంటాడు అబ్బాస్.

నటన నుండి తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, అబ్బాస్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవాలనుకుంటున్నాడు. అది కొనసాగించడానికే తిరిగి ఇండియా వచ్చాడు. అతను చివరిగా మలయాళ చిత్రం పచ్చక్కల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో చివరిగా భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్‌గా రామానుజన్ బయోపిక్‌లో నటించాడు.

Tags

Read MoreRead Less
Next Story