Priyanka Mohan : పవన్‌తో నటించడం నా అదృష్టం : ప్రియాంక మోహన్

X
By - Manikanta |21 Aug 2024 7:30 PM IST
పవన్ కల్యాణ్ పక్కన నటించడం తన అదృష్టం అంటోంది నటి ప్రియాంక అరుల్ మోహన్. పవన్ నటిస్తోన్న ఓజీ చిత్రంలో ఈ అమ్మడే హీరోయిన్. నాని సరిపోదా శనివారం ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ భామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఓజీ లాంటి గొప్ప కథలో భాగమవడం సంతోషంగా ఉందని.. అవకాశం ఇచ్చిన మేకర్స్‌కు థ్యాంక్స్ చెప్పింది. ‘పవన్, నాని ఇద్దరూ క్రియేటివ్‌గా ఉంటారు. నాని సినిమాల గురించి ఎప్పుడూ కలలు కంటారు. పవన్ ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు’ అని తెలిపింది. కాగా సరిపోదా శనివారం ఆగస్ట్ 29న రిలీజ్ కానుంది. ఈ మూవీలో ప్రియాంక కానిస్టేబుల్ పాత్రలో నటించింది. మొత్తం కథని మలుపు తిప్పే పాత్ర ఆమెదేనని నాని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com