జీవితంలో చాలా తప్పులు చేశాను.. 19 ఏళ్ల వయసులో..: నటుడు అజయ్

జీవితంలో చాలా తప్పులు చేశాను.. 19 ఏళ్ల వయసులో..: నటుడు అజయ్
విలన్‌గా తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న నటుడు అజయ్. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశ ముదురు, ఛత్రపతి వంటి ఎన్నో

విలన్‌గా తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న నటుడు అజయ్. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశ ముదురు, ఛత్రపతి వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోలకు ఫ్రెండ్‌గా, ప్రతి నాయకుడిగా అనేక పాత్రలు పోషించాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజిగా ఉన్న అజయ్ ఈ మధ్య తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత విషయాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.

టీనేజ్‌లో ఉండగా తాను చేసిన అల్లరి పనులను గుర్తుకుతెచ్చుకున్నాడు. 19 ఏళ్ల వయసులో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా డబ్బులు తీసుకుని స్నేహితులతో కలిసి నేపాల్ పారిపోయాడట. అక్కడ మూడు నెలలు గడిపి డబ్బులు లేకపోవడంతో హోటల‌్‌లో పని చేయాల్సి వచ్చింది. డబ్బు సమకూర్చున్నాక తిరిగి ఇంటికి వచ్చాడు.

ఇవే కాదు జీవితంలో ఇంకా చాలా తప్పులు చేశాను అని చెప్పుకొచ్చాడు. కాలేజీ చదిదే రోజుల్లో శ్వేత రావురిని ప్రేమించి ఇంట్లో వాళ్లకు తెలియకుండా వివాహం చేసుకున్నాడు. ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకుని సెటిల్ అయిన తరువాత పెద్దవాళ్లకు చెప్పారట. కుటుంబసభ్యుల సమక్షంలో శ్వేతను మరోసారి వివాహం చేసుకున్నట్లు అజయ్ వివరించాడు.

కాగా ప్రస్తుతం అతడికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. భార్య శ్వేత 2017లో మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో పాల్గొని ఫైనల్ రౌండ్‌కు ఎంపికయ్యారు. 2018లో మిస్టర్ అండ్ మిస్టర్స్ సౌత్ ఇండియాగా కూడా ఎంపికయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story