Arjun Sarja: నటుడు అర్జున్ సర్జాకు కరోనా పాజిటివ్..

Arjun Sarja: దేశంలో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తూనే.. ఇటీవల ప్రముఖ నటీనటులు కోవిడ్ బారిన పడడం కొంత ఆందోళనకు గురి చేస్తున్న అంశం. సామాన్యులతో పోలిస్తే కోవిడ్ ప్రోటోకాల్స్ కచ్చితంగా పాటిస్తారు. అయినా కోవిడ్ బారిన పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం నటుడు కమల్ హాసన్ కరోనా బారిన పడి కోలుకున్నారు.. తాజాగా కన్నడ నటుడు అర్జున్‌కు కరోనా పాజిటివ్ అనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
అర్జున్ ఇటీవల ఒక టెలివిజన్ రియాలిటీ షోను హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్ గ్రాండ్ ఫినాలే కొద్ది రోజుల క్రితం జరిగింది. ఈవెంట్ తర్వాత అర్జున్ కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. ఆ టెస్ట్‌లో అతడికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది.
అదే విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజిలో పోస్ట్ చేశారు. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది.. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను.. అవసరమైన అన్ని ప్రొటోకాల్స్ తీసుకుంటున్నాను.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మాస్క్ ధరించడం మరచిపోవద్దని కోరారు. ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని తెలిపారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com