రెండో పెళ్లి చేసుకున్న ఆశిష్ విద్యార్థి..

రెండో పెళ్లి చేసుకున్న ఆశిష్ విద్యార్థి..
నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో రూపాలి బారువాను రెండో వివాహం చేసుకున్నారు.

నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో రూపాలి బారువాను రెండో వివాహం చేసుకున్నారు. ఆశిష్ మొదటి భార్య రాజోషి బారువా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ విషయాన్ని, వారి పెళ్లికి సంబంధించిన ఫోటోను పోస్ట్‌ చేశారు. అస్సాంకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ రూపాలి బారువాను ఆశిష్ వివాహం చేసుకున్నారు. ఆశిష్ మొదటి భార్య అయిన నటి రాజోషి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్‌లను పంచుకున్నారు. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మీ ఉద్దేశ్యం ఏమిటో అర్థమైంది అని ఆమె రాసుకొచ్చారు.

మరొక పోస్ట్‌లో, అతిగా ఆలోచించడం జీవితంలో ప్రశాంతతను ఎలా నాశనం చేస్తుందో అనే విషయం అర్ధమైంది అని రాశారు. రాజోషి బారువా అలనాటి నటి శకుంతల బారువా కుమార్తె. ఆశిష్.. రాజోషిని 23 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి అర్థ విద్యార్థి అనే కుమారుడు ఉన్నాడు. ఆశిష్ విద్యార్థి తన రెండవ వివాహం గురించి మాట్లాడాడు. ఆశిష్ విద్యార్థి భార్య రూపాలి బారువా గౌహతికి చెందిన ఫ్యాషన్ వ్యాపారవేత్త. ఆమెకు కోల్‌కతాలో ఒక ఫ్యాషన్ స్టోర్‌ ఉంది.

" రూపాలిని వివాహం చేసుకోవడం అసాధారణమైన అనుభూతి. మేము ఉదయం కోర్టులో వివాహం చేసుకున్నాము. తరువాత సాయంత్రం గెట్-టుగెదర్ చేసాము. మేము కొంతకాలం క్రితం కలుసుకున్నాము. మా స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాము. మా పెళ్లి చిన్న కుటుంబ వ్యవహారంగా జరగాలని మేమిద్దరం కోరుకున్నాము." అని ఆశిష్ మీడియాకు వివరించారు. వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story