Ekta Sharma: టీవీ నటి.. అవకాశాల్లేక కాల్ సెంటర్‌లో పని చేస్తూ..

Ekta Sharma: అప్పటి వరకు ఆమె ఎవరో తెలియదు.. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. అవకాశాలు వచ్చి పడతాయి. ఒక్క ప్లాప్ వచ్చిందంటే మళ్లీ కెరీర్ ఢమాల్.. దాదాపు సినీ రంగంలో ఉన్న వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. నటి ఏక్తాశర్మ టీవీ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలు పోషించింది. ఎంతో పేరు తెచ్చుకుంది. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు. అవకాశాలు లేవు.. నటించమని అడిగే వాళ్లు లేరు. పూట గడవని పరిస్థితి. ఒకర్ని చేయి చాచకుండా వచ్చిన పని చేయాలనుకుంది. కాల్ సెంటర్‌లో జాబ్ కోసం ట్రై చేసింది.
టెలివిజన్ నటి ఏక్తా శర్మ, క్కుసుమ్, క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ, మరియు బెపనా ప్యార్ వంటి సీరియల్స్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో కాల్ సెంటర్‌లో చేరారు. ఏక్తా తన కుమార్తె కోసం, తన కోసం ఏదో ఒకటి చేయాలనుకుంది. ఏదో ఒక అద్భుతం జరిగే వరకు వేచి ఉండలేనని తెలిపింది.
కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ చాలా మంది జీవితాలను ఛిద్రం చేసిందని తెలిపింది. డబ్బు సంపాదించడానికి తన విద్యను ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఏదైనా పని ఇప్పించమని టెలివిజన్ పరిశ్రమలో తనకు పరిచయం ఉన్న వ్యక్తులను అడిగింది. కానీ వారి నుంచి ఆమెకు ఎటువంటి సమాధానం రాలేదు.
ఏక్తా మీడియాతో మాట్లాడుతూ, "నేను చదువుకున్న మహిళను. ఏం పని లేదని ఇంట్లో కూర్చొని ఏడ్చే బదులు, బయటకు వెళ్లి సంపాదించాలని నిర్ణయించుకున్నాను. నేను గౌరవప్రదమైన పని చేస్తున్నాను దాని గురించి నేను గర్వపడుతున్నాను. మొదట్లో పని దొరుకుతుందని ఆశతో నా నగలను అమ్మేశాను.
కానీ ఒక సంవత్సరం తర్వాత కూడా అవకాశాలు రాలేదు. దాంతో బయటకు వెళ్లి పని కోసం వెతకడం ప్రారంభించాను. స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి మోడలింగ్ చేస్తూ, ఎప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో పని చేసే ఏక్తా, ఆ ఉద్యోగాన్ని చేపట్టడం 'చాలా కఠినమైన నిర్ణయం' అని పేర్కొంది.
ఆమె ఇలా చెప్పింది, "వాస్తవ ప్రపంచంలో బయటకు వెళ్లి పని చేయడానికి నేను మానసికంగా సిద్ధపడవలసి వచ్చింది. మీ చుట్టూ స్పాట్ బాయ్ ఉన్న విలాసవంతమైన వానిటీ జీవితాన్ని గడపడం నుండి, ఇప్పుడు కోపంగా ఉన్న కస్టమర్‌లతో కాల్‌లో మాట్లాడటం చాలా బాగుంది. ఇలాంటి సమయంలో ఎవరైనా సలహాలు ఇస్తారు కానీ ఆదుకునే వాళ్లు ఎవరూ ఉండరు అని ఏక్తా చెప్పుకొచ్చారు.
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని, అయితే ఉద్యోగం దొరక్క కష్టపడటం ఇదే తొలిసారి అని ఏక్తా చెప్పింది. ఆమె చివరి షో బెపనా ప్యార్ లాక్‌డౌన్‌కు ముందు ముగిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com