Hamsa Nandini: క్యాన్సర్‌ను జయించి సినిమా షూటింగ్‌లో పాల్గొన్న నటి..

Hamsa Nandini: క్యాన్సర్‌ను జయించి సినిమా షూటింగ్‌లో పాల్గొన్న నటి..
Hamsa Nandini: బ్రతకాలన్న కోరిక బలంగా ఉంటే భయంకరమైన వ్యాధిని సైతం జయించొచ్చని నిరూపించింది నటి హంసానందిని.

Hamsa Nandini: బ్రతకాలన్న కోరిక బలంగా ఉంటే భయంకరమైన వ్యాధిని సైతం జయించొచ్చని నిరూపించింది నటి హంసానందిని. వంశపారంపర్యగా వచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్‌. బాధను భరించి కీమోలు చేయించుకుని మునుపటి ఉత్సాహంతో మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న హంస తనకు పునర్జన్మ లభించినట్లు భావిస్తున్నానని వెల్లడించింది.

ఇది నా నిజమైన పుట్టినరోజు. నటిగా కెమెరా ముందు ఎక్కువకాలం పని చేశాను. ఈ రోజు రాత్రి నా కోస్టార్స్, సిబ్బందితో నేను నా పుట్టిన రోజు జరుపుకుంటున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. గత ఏడాది డిసెంబర్‌లో, తాను బ్రెస్ట్ క్యాన్సర్‌ బారిన పడ్డానని, ఇప్పటికే తొమ్మిది సైకిల్స్ కీమోథెరపీ చేయించుకున్నానని, మరో ఏడు కీమోలు మిగిలి ఉన్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "4 నెలల క్రితం, నా రొమ్ములో చిన్న గడ్డ ఉన్నట్లు అనిపించింది.



ఆ క్షణంలోనే నా జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదని నాకు తెలిసింది. 18 సంవత్సరాల క్రితం నేను ఒక భయంకరమైన వ్యాధితో మా అమ్మను కోల్పోయాను. నేను కూడా క్యాన్సర్ నుంచి తప్పించుకోలేనని అనుకున్నాను. ఇప్పుడు నా బ్రెస్ట్‌లో గడ్డ అదే అని భావించాను.. మొదట భయపడ్డాను. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెండు గంటల్లో నేను మామోగ్రఫీ క్లినిక్‌లో పరీక్ష చేయించుకోవడానికి వెళ్లాను.



వెంటనే నాకు బయాప్సీ అవసరమని సూచించిన సర్జికల్ ఆంకాలజిస్ట్‌ను కలవమని అక్కడి వైద్యులు సూచించారు. బయాప్సీ నా భయాలన్నింటినీ ధృవీకరించింది. నాకు గ్రేడ్ III ఇన్వాసివ్ కార్సినోమా (రొమ్ము క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది" అని ఆమె అప్పటి పోస్టులో వెల్లడించింది.


హంస అనేక తెలుగు చిత్రాలలో కనిపించింది. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేదీ చిత్రంలో ఇట్స్ టైం టు పార్టీ పాటలోని డ్యాన్స్‌తో మరింత పాపులరైంది. అయితే తాను ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల వివరాలు వెల్లడించలేదు. ఏది ఏమైనా హంస క్యాన్సర్ నుంచి కోలుకొని తిరిగి సినిమాలు చేయడం పరిశ్రమకు ఆనందాన్ని ఇస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story