Harshavardhan: అమృతం హీరోకి మరో మంచి అవకాశం..

Harshavardhan: నటుడు హర్షవర్ధన్‌కి అదృష్టం మరోసారి తలుపు తట్టింది.. అమృతం సీరియల్‌తో పాపులర్ అయిన ఆయనకు సినిమాల్లో అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి. డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి నటుడై నిరూపించుకున్నా.. దర్శకుడు కావాలన్న ఆశ మాత్రం చావలేదు.. తనలోని రైటర్‌ని కూడా నిద్ర లేపి ఇష్క్, గుండెజారి గల్లంతయ్యింది వంటి చిత్రాలకు సంభాషణలు సమకూర్చారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.. అన్నీ పూర్తి చేసుకున్నా ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది.. దీంతో టైటిల్ మార్చి చూద్దామని ప్రయత్నించి గూగ్లీ అనే పేరుని ఖరారు చేశాడు. అయినా నిర్మాతలు వెనుకడుగు వేశారు.
దీంతో టైమ్ బ్యాడ్ అనుకుని కొన్నాళ్లు దర్శకత్వ ఆలోచనలు పక్కన పెట్టారు హర్షవర్ధన్.. తాజాగా సుధీర్ బాబు ఆయనకు డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. ఆసియన్ సంస్థ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ ఈరోజే మొదలైంది. అన్నీ అనుకూలించి ఆ సినిమా పట్టాలెక్కి విజయవంతం కావాలని హర్షవర్ధన్ గురించి బాగా తెలిసిన తోటీ నటీ నటులు కోరుకుంటున్నారు.
ఇక సుధీర్ బాబు కూడా కష్టపడే మనస్థత్వం ఉన్న ఓ మంచి నటుడు.. ఆ మధ్య వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ నిరాశ పరిచినా, ఈసారి మరింత పట్టుదలగా మరో కథకు సిద్ధమయ్యారు.. హర్షవర్ధన్ సినిమాతో పాటు సమ్మోహన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com