Manjima Mohan: బాడీ షేమింగ్ కామెంట్లు నన్ను బాధించవు..: నటి మంజిమా మోహన్

Manjima Mohan: బాడీ షేమింగ్ కామెంట్లు నన్ను బాధించవు..: నటి మంజిమా మోహన్
Manjima Mohan: అందరి శరీరాకృతి ఒకే విధంగా ఉండదు. కొందరు లావుగా ఉంటే, మరికొందరు సన్నగా ఉంటారు. అది వారి శరీర పరిస్థితిని బట్టి ఉంటుంది.

Manjima Mohan: అందరి శరీరాకృతి ఒకే విధంగా ఉండదు. కొందరు లావుగా ఉంటే, మరికొందరు సన్నగా ఉంటారు. అది వారి శరీర పరిస్థితిని బట్టి ఉంటుంది. మరి కొందరికి జీన్స్ పరంగా తలెత్తే ఇబ్బందులు. ఏదైతేనేం వారి బాహ్య శరీరం వారికంటే ఇతరులనే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్లుంది. సోషల్ మీడియా వేదికగా విమర్శించడం పరిపాటిగా మారింది.



నాజుగ్గా, సన్నజాజి తీగలా ఉన్నవారు అందరికీ నచ్చొచ్చేమో కానీ, ఒక మనిషి శరీరాకృతిని బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని సెలబ్రెటీలు పలు సందర్భాల్లో వాపోతుంటారు. ఇటీవల మలయాళీ నటి మంజిమా మోహన్ నటుడు గౌతమ్ కార్తీక్‌ను వివాహం చేసుకున్నారు.



వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ జంటను చూసి ముచ్చటగా ఉన్నారు అని శుభాకాంక్షలు చెప్పిన వారు కొందరైతే మంజిమను లావుగా ఉన్నారని విమర్శించిన వారు మరికొందరు ఉన్నారు.


ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన మంజిమ అలాంటి వ్యాఖ్యలు తనపై ప్రభావం చూపవని అన్నారు. నేను నా శరీరంతో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. మరి మీకెందుకు బాధ అని విమర్శకులను ఉద్దేశించి అన్నారు.


"నిజానికి, మా పెళ్లిలో కూడా, కొంతమంది దాని గురించి వ్యాఖ్యానించారు. ఇంతకుముందు, ఇది నన్ను ఇబ్బంది పెట్టేది, కానీ ఇప్పుడు నేను నా శరీరంతో సుఖంగా ఉన్నాను మరియు నేను కోరుకున్నప్పుడు నేను బరువు తగ్గగలనని నాకు తెలుసు, "అని ఆమె తెలిపింది.


ఇంకా ఫిట్‌నెస్‌తో పాటు వ్యాయామం కూడా చేస్తున్నానని చెప్పింది. "ఇది ఇతరులను ఎందుకు ప్రభావితం చేస్తుందో నాకు ఖచ్చితంగా తెలియదు," అని ఆమె పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story