Nagineedu :పేరు తెచ్చిన మర్యాద రామన్నే తనకి మైనస్ అయింది.. !

Nagineedu : సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'మర్యాద రామన్న'... ఈ సినిమాలో రామినీడు పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశారు నటుడు నాగినీడు.. ఎల్.వి.ప్రసాద్ కి ఈయన దగ్గర బంధువు. నటుడు కాకముందు ప్రసాద్ ల్యాబ్‌కి జనరల్ మేనేజర్‌గా పనిచేశారు.
మర్యాద రామన్న సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగానే మర్యాదరామన్న చిత్రం గురించి మాట్లాడుతూ.. ఆ చిత్రం నన్ను ఓ స్థాయిలో నిలబెట్టిందని, కానీ, అదే నాకు మైనస్ అయిందని అన్నారు.
ఆ తర్వాత మరో సినిమా అవకాశం కోసం ఏ దర్శకుడినైనా సంప్రదిస్తే 'నాగినీడుగారు.. మీరు మాత్రమే న్యాయం చేయగలరు అనే పాత్ర ఉంటే మీకు ఇస్తాం. మా సినిమాలో అలాంటి క్యారెక్టర్ లేదు. మిమ్మల్ని సాధారణ పాత్రల్లో ఊహించుకోలేం కదా అని అన్నారని చెప్పుకొచ్చారు.
ఇక ప్రోమో చివర్లో ఓ దర్శకుడు తనపై సీరియస్ అయిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు నాగీనీడు. అయితే ఈ దర్శకుడు ఎవరో తెలియాలంటే నవంబరు 15 వరకు వేచి చూడాల్సిందే..!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com