రెడీ.. స్టార్ట్.. యాక్షన్.. నానీ 'మీట్ క్యూట్'..

రెడీ.. స్టార్ట్.. యాక్షన్.. నానీ మీట్ క్యూట్..
మీట్ క్యూట్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

వాల్ పోస్టర్ పతాకపై సినిమాలు తీస్తున్న హీరో నాని సోమవారం మరో సినిమాను తీస్తున్నారు. మీట్ క్యూట్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి టాలెంటెడ్ దర్శకులు ఈ వాల్ పోస్టర్ బ్యానర్ ద్వారా పరిచయం అయ్యారు.

సత్యరాజ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టారు. ఫిమేల్ కాస్ట్ ఎక్కువగా ఉండే ఈ సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక అతి త్వరలో జరగనుంది. వసంతకుమార్ కెమెరామెన్‌గా వ్యవహరించే ఈ సినిమాకు విజయ్ బల్గానియన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు నాని సమర్పకులు కాగా నిర్మాత ప్రశాంతి త్రిపురనేని.

Tags

Read MoreRead Less
Next Story