Nara Rohith : నారా రోహిత్ తండ్రి అస్తమయం

Nara Rohith :  నారా రోహిత్ తండ్రి అస్తమయం
X

టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామ్మూర్తి నాయుడు. ఇంటి వద్దే ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. ఈ శుక్రవారం ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. శనివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాటు హార్ట్ స్ట్రోక్ కూడా రావడంతో తుది శ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి లోకేష్ హాస్పిటల్ కు వచ్చారు.

రేపు ఆదివారం రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు సొంత ఊరు నారా వారి పల్లెలో అంత్యక్రియలు జరపనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సాయంత్రం ఆయన హైదరాబాద్ కు రానున్నారు.

ఇక రామ్మూర్తి నాయుడు 1994 - 1999 వరకూ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు.

Tags

Next Story