Naresh on Prakah Raj Pannel:మోదీ గెలిచారని కాంగ్రెస్ దేశం విడిచి వెళ్లిపోలేదు కదా..: నరేష్

Naresh (tv5news.in)
Naresh on Prakah Raj Pannel: మా ఎన్నికల హడావిడి ముగిసింది అనుకుంటే.. ఆ వేడి ఇంకా చల్లారలేదని ఫిల్మ్‌నగర్ వార్తలు చెబుతున్నాయి. మా అధ్యక్ష ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. విష్ణుకు సపోర్ట్‌గా నిలిచిన నరేశ్‌పై ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ మంగళవారం సాయింత్రం మీడియా సమావేశం నిర్వహించారు.
అంతే కాకుండా ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా బుధవారం మా అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నరేశ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోయిన తరువాత కూడా ఎందుకు మాట్లాడుతున్నారు అని నరేశ్ ప్రశ్నించారు.
ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎంపిక కావడం. మా ఒక సేవా సంస్థ. అందరం కలిసి పనిచేద్ధాం. విష్ణుని ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే బాగుండదు. ఎన్నికల సమయంలో అందరం కలిసి పని చేద్దామన్నారు. అంతలోనే ఏమైంది. ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు.
మోదీ గెలిచారని కాంగ్రెస్ దేశం విడిచి వెళ్లిపోలేదు కదా.. మా సభ్యులెవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అయినా ఎన్నికలయ్యాక ఈ ఆరోపణలు ఎందుకు అని కామెంట్ చేశారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com