Prakash Raj : ఈ.డి ముందు హాజరైన ప్రకాష్ రాజ్

బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు అనే కారణంతో చాలామంది సినీ నటులు, టివి నటులకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గతంలోనే నోటీసులు పంపించింది. నోటీస్ లు అందుకున్న వాళ్లంతా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పింది. ఈ లిస్ట్ లో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే రానా తను అటెండ్ కావడానికి టైమ్ అడిగాడు. తాజాగా ప్రకాష్ రాజ్ ఈ.డి ముందు హాజరయ్యాడు. దీనికి సంబంధించి ఈ.డి సంధించే ప్రశ్నలకు ప్రకాష్ రాజ్ సమాధానం చెప్పాల్సి ఉంది.
అయితే తను ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ను 2017లో చేశానని.. అది తప్పు అని తెలియడంతో వెంటనే మానేశాను అని గతంలోనే వీడియో విడుదల చేశాడు ప్రకాష్ రాజ్. అయినా ఈ.డి ఆయనకూ నోటీస్ లు పంపించింది. మరి ఈ కేస్ లో ఎలాంటి పురోగతి ఉంటుందో కానీ.. జాతీయ స్థాయిలో కూడా చాలామంది నటులు, క్రికెటర్స్ ఈ యాప్స్ ను ప్రమోట్ చేశారు. మరి వారందరినీ ఈ తరహాలోనే విచారిస్తారా లేదా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com