శ్యాంబాబుకి బంపరాఫర్.. ఇప్పుడు శోభన్ బాబుగా..

శ్యాంబాబుకి బంపరాఫర్.. ఇప్పుడు శోభన్ బాబుగా..
కొన్ని పాత్రలు అంతే.. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని తెచ్చిపెడతాయి.

కొన్ని పాత్రలు అంతే.. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని తెచ్చిపెడతాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో పృథ్విరాజ్ ఒక నిమిషం అయిదు సెకన్లు నిడివి ఉన్న పాత్ర. అయితేనేం ఆ పాత్ర సెన్సేషన్ సృష్టించింది. ఇటు ఇండస్ట్రీతో పాటు, రాజకీయ నాయకులను కూడా మాట్లాడేలా చేసింది. అంతే కాదండోయ్.. ఇప్పుడు మరో సినిమా ఛాన్స్ ని కూడా తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో శోభన్ బాబు పేరుతో మరో సంచలనం సృష్టించడానికి పృథ్వి సిద్ధమవుతున్నాడు. ఓ డైరెక్టర్ తనకు ఈ అవకాశం ఇచ్చారని, ఏకంగా రెండు గంటలు తన మీదే ఫోకస్ ఉంటుందని పృథ్వి అభిమానులతో పంచుకున్నారు.

నాకు వచ్చిన ఓ అద్భుతమైన అవకాశం. దర్శకుడు ఎవరు.. ఏ బ్యానర్ అనే వివరాలు త్వరలో తెలియజేస్తా అని .. ఇది నా కెరీర్ ను మలుపు తిప్పే చిత్రం అవుతుంది అని అన్నారు. ఈ శ్యాంబాబును అప్పుడు కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పృథ్వీ అంటూ సెల్ఫీ వీడియోను పంచుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story