నటుడు రాహుల్ దేవ్ తన భార్యను బ్రతికించుకోవడం కోసం..

నటుడు రాహుల్ దేవ్ తన భార్యను బ్రతికించుకోవడం కోసం..
నిజ జీవితంలో భార్యని అమితంగా ప్రేమించే ఓ మంచి భర్త. ఉత్తమ విలన్‌గా ఫిలింఫేర్ అవార్డులు ఎన్నో అందుకున్నారు.

సినిమాల్లో కరడు గట్టిన విలన్ పాత్రలు పోషించిన రాహుల్ దేవ్.. నిజ జీవితంలో భార్యని అమితంగా ప్రేమించే ఓ మంచి భర్త. ఉత్తమ విలన్‌గా ఫిలింఫేర్ అవార్డులు ఎన్నో అందుకున్నారు. తెలుగులోనూ సింహాద్రి, సీతయ్య వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

వెండి తెరపైనే కాదు బుల్లి తెరపైనే కాదు బుల్లితెరపై హిందీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉంటారు రాహుల్. బిగం‌బాస్ సీజన్ 10 లో పాల్గొని మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమా జీవితంలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ దేవ్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు.

రాహుల్ రానీ అమ్మాయిని 1998లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు జన్మించిన తరువాత రీనా క్యాన్సర్ బారిన పడింది. ఆమెను బ్రతికించుకోవడం కోసం రాహుల్ చేయని ప్రయత్నం లేదు. మెరుగైన చికిత్స కోసం ఎన్నో ఆస్పత్రులకు తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఆమె వైద్యం కోసం తన ఆస్తులను కూడా అమ్ముకున్నారు. ఈ క్రమంలోనే

ఆమెకు చికిత్స చేయించేందుకు డబ్బుల్లేక సినిమాల్లో అవకాశాలిప్పించమంలూ ఎంతో మందిని ప్రాధేయపడ్డాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను మృత్యువు కబళించింది. క్యాన్సర్‌తో పోరాడుతూ 2009లో మరణించింది.

ఆమె మరణానంతరం కొడుకు బాగు కోసం ఇండస్ట్రీకి దూరమయ్యాడు. తన కొడుకును పై చదువులకు లండన్ పంపించారు. సినిమాలు, సీరియల్స్‌తో బిజీ అయిపోయారు. భార్య జ్ఞాపకాలతో అలాగే ఒంటరిగా ఉండిపోయాడు. మళ్లీ పెళ్లి చేసుకోలేదు.

Tags

Next Story