Raj Tharun : హీరో రాజ్ తరుణ్ కు హైకోర్టులో ఊరట

Raj Tharun : హీరో రాజ్ తరుణ్ కు హైకోర్టులో ఊరట
X

హీరో రాజ్ తరుణ్ కు గురువారం హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ పై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ను మంజూరుచేసింది. ఈ నేపథ్యంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఇందుకు సంబంధించి రూ.20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

లావణ్య అనే యువతి ఇటీవల రాజారుణపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తామిద్దరం కొన్నేళ్ల పాటు సహజీవనం చేశామని, ఆ తర్వాత రహస్య వివాహం చేసుకున్నామని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్ వేరే మహిళతో సన్నిహితంగా ఉంటూ తనని పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేసింది. దీంతో రాజారుణపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.

ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించడంతో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లావణ్య ఆధారాలు సరిగా చూపించకపోవడం వల్లే బెయిల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Tags

Next Story