Raja Babu Actor: 'హాస్య నట చక్రవర్తి'.. అప్పట్లోనే హీరోలతో సమానంగా రెమ్యునరేషన్..

Raja Babu Actor (tv5news.in)

Raja Babu Actor (tv5news.in)

Raja Babu Actor: ఒక సినిమా సమయంలో ఎన్‌టీఆర్ పారితోషికం రూ.35 వేలు కాగా రాజబాబుకు రూ.20 వేలు అని అనుకున్నారు.

Raja Babu Actor: మన ముందు తరం వారికి కమెడియన్ అంటే బ్రహ్మానందం. దాదాపు 30 ఏళ్లుగా కామెడీలో కింగ్‌గా వెలిగిపోతున్నారు బ్రహ్మానందం. ఇక ఈ జెనరేషన్‌లో కామెడీ చేసి నవ్వించే నటులు ఎందరో ఉన్నారు. మరి బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో కమెడియన్ అంటే ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు రాజబాబు. ఆ రోజుల్లో రాజబాబుకు ఉండే క్రేజ్ ఎలా ఉండేదంటే పలు సినిమాల్లో హీరోలకంటే ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ దక్కేదట.

బ్లాక్ అండ్ వైట్ కాలంలో కామెడీ పాత్ర అంటే దర్శక నిర్మాతలకు వెంటనే గుర్తొచ్చే పేరు రాజబాబు. ఇప్పటికీ రాజబాబు కామెడీ అంటే చాలామందికి ఇష్టం. ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. అందుకే ఆయనను ముద్దుగా హాస్య నట చక్రవర్తి అని కూడా పిలుచుకునేవారు అభిమానులు. అందుకే కొన్నాళ్ల తర్వాత రాజబాబు కామెడీ అనేది సినిమాల్లో సెంటిమెంట్‌గా మారిపోయింది. ఎంతలాగా అంటే రాజబాబు ఉంటే సినిమా హిట్టే అనుకునేంతలాగా.

ఎన్‌టీఆర్, రాజబాబు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే ఒక సినిమా సమయంలో ఎన్‌టీఆర్ పారితోషికం రూ.35 వేలు కాగా రాజబాబుకు రూ.20 వేలు అని అనుకున్నారు. కానీ రాజబాబు మాత్రం ఎన్‌టీఆర్‌తో సమానంగా తనకు కూడా రూ.35 వేలు పారితోషికం కావాలని పట్టుపట్టారట. దానికి నిర్మాత ఒప్పుకోకుండా 'ఎన్‌టీఆర్ హీరో.. మీరు కమెడియన్' అని అన్నారట.

అప్పుడు రాజబాబు 'అయితే హీరోనే కమెడియన్‌గా పెట్టి సినిమా తీయండి' అని సమాధానం చెప్పారట. దానికి నిర్మాత ఏమీ మాట్లాడకుండా రాజబాబు అడిగిన పారితోషికానికే సినిమాను ఒప్పుకున్నారట. ఇది మాత్రమే కాదు.. ఇంకా చాలా సందర్భాల్లో రాజబాబు హీరోలతో సమానంగా పారితోషికాన్ని అందుకున్నారు.

రాజబాబు ఒకానొక సమయంలో ఎంత బిజీ అయ్యారంటే ఆయన కేవలం రోజులో గంట మాత్రమే ఒక సినిమాకు కాల్ షీట్ కేటాయించేవారట. మరొక గంట మరొక సినిమాకు ఇచ్చేవారట. రాజబాబు, రమప్రభ కాంబినేషన్ అప్పట్లో సూపర్ డూపర్ హిట్. నేడు రాజబాబు వర్ధంతి కావడంతో సినీ పరిశ్రమ అంతా ఈ గొప్ప నటుడిని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story