Actor Sai Chand: ఆన్ స్క్రీన్ లో ఓ అద్భుతమైన నాన్న.. పెళ్లవకుండానే తండ్రయ్యారు..

Actor Sai Chand: ఆన్ స్క్రీన్ లో ఓ అద్భుతమైన నాన్న.. పెళ్లవకుండానే తండ్రయ్యారు..
Actor Sai Chand: నవరసాలు ఒలికిస్తేనే కదా నటుడంటారు. అవకాశాలు రావాలే కాని అనుభవంతో పనేముంది.. తమలో ఉన్న నటుడిని వెలికితీస్తారు.. నటనలో తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు..

Actor Sai Chand: నవరసాలు ఒలికిస్తేనే కదా నటుడంటారు. అవకాశాలు రావాలే కాని అనుభవంతో పనేముంది.. తమలో ఉన్న నటుడిని వెలికితీస్తారు.. నటనలో తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు.. ప్రేక్షకులను ఆ పాత్రలో లీనమయ్యేలా చేస్తారు. అలాంటి ఓ గొప్ప నటుడు సాయిచంద్.. ఆయన నటించిన సినిమాలు చూస్తుంటే అది నటన అని అనిపించదు.. ఆ పాత్రలో లీనమైపోతారు.. నిజంగానే జరిగింది అన్న అనుభూతిని కలిగిస్తారు ప్రేక్షకులకి. తండ్రి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సాయిచంద్ ఫిదాలో సాయి పల్లవి, శరణ్యకు తండ్రిగా నటించి ఇప్పటికీ వారి చేత నాన్న అనే పిలిపించుకుంటున్నారు..

సాయి చంద్ తాను నటించిన అత్యంత మనోహరమైన తండ్రి పాత్రలను గురించి వివరిస్తూ.. ఉప్పెనలో తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు తండ్రిగా నటించమని చిరంజీవి అడిగారు.. అయితే ఆ పాత్ర చేయడానికి చాలా సంశయించాను. ఫిదా తర్వాత సాయి పల్లవికి తప్ప మరెవరికీ తండ్రిగా నటించకూడదనుకున్నాను. "ఇది వింతగా అనిపించవచ్చు, కానీ నేను సినిమాలో సాయి పల్లవితో చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను, నేను దాని నుండి బయటకు రాలేకపోయాను" అని అన్నారు. ఆ సినిమాలో సాయి చంద్ కూతురు భానుమతితో మాట్లాడుతూ నా తల్లి కదా, నా మాట ఇనమ్మా.... అంటూ నవ్వుతూ చెప్తాడు. ఈ మాటలు చాలా మంది యువతులతో ప్రతిధ్వనించాయి. ఇది తెలుగు చిత్రాలలో తండ్రీ-కూతుళ్లు నటించిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

"సాయి పల్లవి చిన్న కూతురిగా శరణ్య పెద్ద కూతురిగా నటించారు. ఇప్పుడు కూడా ఎక్కడ కలిసినా వాళ్లు నన్ను నానా అని పిలుస్తారు. మా సంబంధం తెరపై ఉన్న బంధానికి మించి పెరిగింది" అని సాయి చంద్ చెప్పారు. సాయి పల్లవితో పేరులోని కొంత భాగాన్ని పంచుకోవడమే కాకుండా, యాదృచ్చికంగా "ఆమె పుట్టిన 1992లో నా తొలి ఇన్నింగ్స్‌ కి పుల్ స్టాప్ పెట్టాను. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఫిదాలో ఆమెతో కలిసి నటించేందుకు మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను అని అన్నారు.

నక్సల్ ఉద్యమంపై ఇటీవల విడుదలైన వేణు ఉడుగుల చిత్రం విరాట పర్వం లో మళ్లీ సాయి పల్లవికి తండ్రిగా నటించే అవకాశం వచ్చింది. అతను ఫిదాలో తన కుమార్తెలకు స్వేచ్ఛ ఇవ్వాలని విశ్వసించే విద్యావంతుడు. విరాట పర్వంలో అతను తన కూతురికి గురువుగా మారి, ఆమె ప్రయత్నాలకు స్ఫూర్తినిచ్చే ఒగ్గు కథా కళాకారుడిగా నటించారు.

ఫిదా, ఉప్పెన రెండు సినిమాల్లో తల్లి లేని పిల్లలకు తండ్రిగా నటించారు. తన పిల్లలకు "తల్లి లేనప్పుడు, తండ్రి తన వైఖరిలో మృదుత్వాన్ని అలవర్చుకుంటాడు. తన పిల్లలకు మరింత అండగా ఉండాలనుకుంటాడు. ఫిదా మరియు ఉప్పెనలో నా పాత్రకు నేను అందించిన లక్షణం అదే " అని చెప్పారు. తెలంగాణలో సాధారణంగా కూతుళ్లు తమ తండ్రులకు అంత సన్నిహితంగా ఉండరు. వారి మధ్య ఎమోషనల్ బాండింగ్ అంతగా ఉండదు. అందుకే ఫిదా మరియు విరాట పర్వంలలో తండ్రీకూతుళ్ల బంధాన్ని ప్రత్యేకంగా చూపెట్టాము అని చెప్పారు.

విచిత్రం ఏమంటే .. తండ్రి పాత్రల కోసం ఎక్కువ డిమాండ్ ఉన్న నటుడు నిజ జీవితంలో తండ్రి అనుభవన్ని రుచి చూడలేదు. ఆయన ఓ బ్రహ్మచారి. ఇందుకు కారణం అడిగితే ఆయన నవ్వుతూ, తాను ఒంటరిగా ఉండటానికి ప్రత్యేక కారణం ఏమీ లేదని చెప్పాడు. " ప్రేమలో వైఫల్యం నన్ను బ్రహ్మచారిగా మిగిలిపోయేలా చేసిందని అందరూ అనుకుంటూ ఉంటారు. అలాంటిదేమీ లేదు. సమయం అలా గడిచిపోయింది. ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నందున, కజిన్స్, మేనకోడళ్ళు, మేనల్లుళ్ల సహవాసం ఉంటుంది. కాబట్టి నాకు స్వంత కుటుంబం లేదనే ఆలోచన రాదు అని అన్నారు. "సినిమాలు నాకు ఆన్-స్క్రీన్ కుమార్తెలను ఇచ్చాయి. దాంతో పాటు నాకు కుటుంబ సభ్యుల బంధాలు కూడా బలంగా ఉన్నాయి. వాళ్లంతా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు అని అన్నారు.

తెలుగు సాహిత్య దిగ్గజం గోపీ చంద్ తనయుడు సాయి చంద్. మా భూమి అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన మా భూమి 1980లో వచ్చిన చిత్రం. తెలుగు చిత్రసీమలో కొత్త ఒరవడికి నాంది పలికింది. సాయి చంద్ కెరీర్ భారీగా ఉండకపోవచ్చు కానీ అతని నటనా రంగంలో కొన్ని ముఖ్యమైన చిత్రాలు, గుర్తుండిపోయి పాత్రలు ఉన్నాయి. 25 ఏళ్ల విరామం ఉన్నప్పటికీ, సాయి చంద్ ఫిదాతో పునరాగమనం చేశారు. ఆ పాత్ర మరికొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించింది. "మా భూమిలో శేఖర్ కమ్ముల నన్ను చూసిన తర్వాత ఫిదాలో తండ్రి పాత్ర కోసం తనను ఎంపిక చేసినట్లు చెప్పారు.

ఉప్పెన, విరాట పర్వం చిత్రాల కోసం ఏకకాలంలో షూటింగ్‌ చేసిన విశేషాలను గుర్తు చేసుకున్నారు. "నాకు వైష్ణవ్ తేజ్ చిన్నప్పటి నుంచి తెలుసు. అతడిని చిన్నోడా అని పిలిచేవాడిని. ఉదయం నేను అతనితో షూటింగ్‌లో ఉన్నప్పుడు చిన్నోడా అని పిలిచేవాడిని.. సాయంత్రం అవతలి సెట్‌ లో సాయి పల్లవితో విరాటపర్వం షూటింగ్ జరిగేది.. అక్కడి వెళ్లి ఆమెని 'తల్లి'," అని పిలిచేవాడిని అని అన్నారు. ఇక ఈ తండ్రి పాత్రల నుంచి బయటపడాలంటే నేను పూర్తిగా భిన్నమైన జానర్‌లో నటించాలి లేకపోతే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story