Sameer Hasan: ఒక్కసారిగా సమీర్ సీరియల్ కెరీర్ ఆగిపోవడానికి ఆ హీరోయినే కారణమా..?

Sameer Hasan (tv5news.in)
Sameer Hasan: కొన్నిసార్లు సినిమా యాక్టర్స్‌కంటే సీరియర్ ఆర్టిస్టులకే ఎక్కువ నేమ్, ఫేమ్ దక్కుతాయి. సీరియల్స్‌కు ఉండే వ్యూయర్‌షిప్ కూడా దీనికి కారణం. ఇప్పుడు ఓటీటీ అనేది రావడం వల్ల సినిమాలు కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ఇవేవీ లేకముందు సీరియల్సే అందరికీ కాలక్షేపం. అయితే సీరియల్ ఆర్టిస్ట్ సమీర్ ఇటీవల తన కెరీర్‌లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
చాలామంది నటీనటులు ముందుగా సినిమాల్లో నటించి, కెరీర్ కాస్త స్లో అయిన తర్వాత సీరియల్స్‌వైపు అడుగులేస్తుంటారు. అలా కాకుండా సీరియల్స్‌లో క్రేజ్ వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు అందుకునేవారు కూడా ఉంటారు. అందులో ఒకరు సమీర్. సీరియల్ యాక్టర్‌గా స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న తర్వాత సమీర్‌ను ఒక్కసారిగా బుల్లితెర దూరం పెట్టింది. దాంతో తనను సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
సమీర్ తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో 'నా మొగుడు నాకు సొంతం' అనే సీరియల్‌లో నటించాడు. అప్పుడు ఆ సీరియల్ హీరోయిన్‌తో తనకు ఎఫైర్ ఉందని, సెట్‌లోనే తనతో రొమాన్స్ చేస్తున్నాడని కొందరు సమీర్‌పై ప్రచారం చేశారు. దీంతో నిజమేంటో తెలుసుకోకుండా సీరియల్ టీమ్ సమీర్‌ను సీరియల్ నుండి తొలగించింది. దీంతో తన కెరీర్‌కు ఒక్కసారిగా పెద్ద బ్రేక్ పడింది.
ఉన్నపళంగా సీరియల్ నుండి తీసేయడమే కాకుండా సమీర్‌కు రావాల్సిన పేమెంట్స్ కూడా ఆపేశారట. దీంతో కొన్నాళ్ల పాటు తనకు ఇల్లు అద్దే కట్టుకోవడం, ఈఎంఐలు కట్టుకోవడం చాలా కష్టంగా మారిందని చెప్పాడు సమీర్. కొన్నాళ్లు ఆ సీరియల్ టీమ్ నిజమేంటో తెలుసుకుని సమీర్‌కు సారీ చెప్పారట. కానీ అప్పటికే తన కెరీర్‌లో తీవ్ర నష్టం ఎదుర్కొన్నాడట సమీర్. అందుకే వారి క్షమాపణను స్వీకరించలేకపోయానన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com