20 May 2022 9:30 AM GMT

Home
 / 
సినిమా / Sameera Reddy:...

Sameera Reddy: ప్రసవానంతర ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలో అభిమానులతో షేర్ చేసుకున్న నటి సమీరా రెడ్డి..

Sameera Reddy: మనం ఎప్పుడూ ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడగలం, ఏ విధంగా సహాయం చేయగలం అనేది ఆలోచించాలి.

Sameera Reddy: ప్రసవానంతర ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలో అభిమానులతో షేర్ చేసుకున్న నటి సమీరా రెడ్డి..
X

Sameera Reddy: నటి సమీరా రెడ్డి తన కొడుకును ఎత్తుకున్న చిత్రాలను పోస్ట్ చేస్తూ ప్రసవానంతరం తాను ఎదుర్కొన్న ఒత్తిడి గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తన మొదటి బిడ్డ పుట్టిన తర్వాత ఆమె ప్రసవానంతర సమస్యలను ఎదుర్కొన్నానని తెలిపింది. అందులో నుంచి వీలైనంత త్వరగా బయట పడేందుకు మార్గాలను అన్వేషించానని తెలిపింది. తన జీవితంలోని అత్యల్ప సమయంలో తాను తగినంత వేగంగా పని చేయలేక పోయానని పేర్కొంది.

సమీరా PPD అనుభవాన్ని పంచుకుంది!

సమీర తన పోస్ట్‌కి ఇలా క్యాప్షన్ ఇచ్చింది, "మానసిక వ్యాధులు పైకి కనిపించకపోయినప్పటికీ, అవి అంతర్గతంగా మనిషిని చాలా కృంగదీస్తుంటాయి. మానసిక ఆరోగ్యం అనేక రకాల మానసిక ఆరోగ్య పరిస్థితులను సూచిస్తుంది - డిప్రెషన్, ఆందోళన, బైపోలార్ డిజార్డర్, PPD మొదలైన అనేక అంశాలు మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. నాకు ప్రసవానంతర ఒత్తిడి చాలా ఉంది అన్న విషయం కూడా నేను గమనించుకోలేకపోయాను.

నేను తగినంత వేగంగా పని చేయలేదు. నా మొదటి బిడ్డ పుట్టిన తర్వాత నేను ఎంత ప్రయత్నించినా సంతోషంగా ఉండలేకపోయాను. నేను ఇప్పటికీ ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. ఆ సమయంలో మనల్ని జాగ్రత్తగా చూసుకునే వారు ఉండడం చాలా అవసరం. కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడు ఉండటం చాలా ముఖ్యం.

నాలాగే చాలా మంది తల్లులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఉంటారు. ప్రసవానంతర డిప్రెషన్‌ను ఎదుర్కోవడానికి నాకు తెలిసిన సూచనలు, సలహాల జాబితా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అని సమీరా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మనం ఎప్పుడూ ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడగలం, ఏ విధంగా సహాయం చేయగలం అనేది ఆలోచించాలి.

- మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి & మీ మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోండి.

- ఎవరైనా చెప్పేది శ్రద్ధగా వినండి

- మీ పరిస్థితిని ఎవరితోనైనా షేర్ చేసుకోండి.

- ఆరోగ్యకరమైన సంభాషణలు ఉండేలా చూసుకోండి.

- రాత్రి 8 గంటలు నిద్రించడానికి ప్రయత్నించండి.

– ఫోన్, టీవీ వంటి వాటిని తక్కువగా చూడండి.

– మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి.

- మీరు తినే వాటిని గుర్తుంచుకోండి

- 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి.

– మీ ఆలోచనలకు ఒక అర్థం ఉండేలా చూసుకోండి.. అంటే నేను ఈ విధంగా ఆలోచించడం కరెక్టేనా అని మీకు మీరు ప్రశ్నించుకోండి.

– మీరు ఏదైనా పని చేయడం ఇష్టం లేకపోతే వాటిని బలవంతంగా చేయడానికి ప్రయత్నించొద్దు.. నిర్మొహమాటంగా నో చెప్పడం అలవాటు చేసుకోండి.

– మీ కోసం కొంత సమయాన్ని కేటాయించుకోండి. కొత్తగా ఏమైనా చేయడానికి ప్రయత్నించండి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి.

– స్నేహితుడిని, కుటుంబాన్ని సంప్రదించి మీ మానసిక పరిస్థితిని వివరించండి.. మంచి ఫ్రొఫెషనల్ కౌన్సిలర్ ని సంప్రదించండి.

– సహజ చికిత్సతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి ప్రయత్నించండి (హోమియోపతి నాకు నిజంగా సహాయపడిందని నేను నమ్ముతున్నాను)

నెటిజన్లు సమీర పోస్ట్ ను చూసి అమ్మా అని పిలుస్తున్నారు!

ఆమె నిజాయితీని అభినందిస్తున్నారు. నటుడు గౌహర్ ఖాన్ హార్ట్ ఎమోజితో "మీరు అద్భుతమైన తల్లి" అని వ్యాఖ్యానించారు. అనితా హస్సానందని 'బెస్ట్ మామ్' అని రాశారు. ఒక అభిమాని, అమ్మా .. మీరు చాలా అద్భుతంగా ఉన్నారు అని వ్యాఖ్యానించారు.

మరొక నెటిజన్ మీరు మీ జీవితంలోని ఉత్తమ సమయాన్ని ఆస్వాదిస్తున్నారని నేను భావిస్తున్నాను అని రాశారు. తల్లి అయిన తర్వాత మహిళలు మానసికంగా మరియు శారీరకంగా చాలా కష్టంగా ఉంటారు. కానీ మీరు ఇతర స్త్రీలను కూడా వారిలాగే తమను తాము ప్రేమించుకోమని ప్రోత్సహిస్తున్నారు అని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రెండవ బిడ్డ పుట్టడం గురించి తనకు ఖచ్చితంగా తెలియదని సమీరా గతంలో పంచుకుంది. ఒత్తిడి కారణంగా తన శరీరం స్వీయ నియంత్రణను ఎలా కోల్పోయింది, అది తన వివాహాన్ని ఎలా దెబ్బతీసింది అనే దాని గురించి కూడా ఆమె చెప్పింది.

అన్ని అసమానతలు ఉన్నప్పటికీ సమస్యలను అధిగమించడానికి తన భర్త మరియు కుటుంబం తనకు సహాయపడిందని సమీరా పేర్కొంది. సమీరా జనవరి 2014లో మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో అక్షయ్‌ని వివాహం చేసుకుంది. ఈ జంట 2015లో తమ కుమారుడు హన్స్‌ను, 2019లో కుమార్తె నైరాను స్వాగతించారు.

Next Story